మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ పెంచాడు. ఆయన వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి మూవీ చేస్తున్న ఆయన, సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నారు. ఉగాది కానుకగా విడుదలైన ఖిలాడి టీజర్ ఆకట్టుకుంది. ఖిలాడి మూవీలో రవితేజ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపించడం విశేషం. 


కాగా నేడు ఉగాది పండగను పురస్కరించుకొని కొత్త ప్రాజెక్ట్ లాంఛ్ చేశాడు రవితేజ. శరత్ దర్శకుడిగా ఎస్ఎల్వి సినిమాస్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో నేడు సినిమా లాంఛ్ చేశారు. లాంఛింగ్ ఈవెంట్ కి దర్శక నిర్మాతలతో పాటు హీరో రవితేజ హాజరయ్యారు. ఈ సినిమాకు రవితేజ క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దివ్యాన్షీ కౌశిక్ నటిస్తున్నారు. 


ఇదే నెలలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది.  ఈఏడాది చివర్లో లేదా సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలయ్యే అవకాశం కలదు. ఇక ఈ మూవీలో నటించే ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.