గతేడాది `ఇస్మార్ట్ శంకర్‌`తో భారీ బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్న రామ్‌.. ప్రస్తుతం `రెడ్‌` సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. డైరెక్ట్ థియేటర్‌లోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎప్పుడు ప్రైవేట్‌ లైఫ్‌కే ఇష్టపడతాడు రామ్‌. బయట పెద్దగా కనిపించరు. సెలబ్రిటీ పార్టీల్లోనూ ఆయన ఉండరు. కానీ చాలా రోజుల తర్వాత ఆయన ఇటీవల దిల్‌రాజు బర్త్ డే పార్టీలో మెరిసారు. సందడి చేశారు. 

అయితే తాజాగా ఆయన ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో రామ్‌ చెబుతూ కరోనా వల్ల తమ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడిందట. `ఈ ఏడాది నా జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. తన కుటుంబం కూడా కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. మా మదర్‌, బ్రదర్‌కి కరోనా సోకింది. సోదరుడికి కాస్త సీరియస్‌ అయ్యింది. కరోనా కారణంగా ఎన్నో భిన్నమైన అనుభావాలు ఎదుర్కొన్నాను. అందులో కొన్ని మంచివి ఉన్నాయి, మరికొన్ని చెడ్డవి ఉన్నాయ`న్నారు. 

`లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండటం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. అది సంతోషంగా అనిపించింది. ఎక్కువ రోజు ఇంట్లోనే గడపాల్సి రావడం ఇబ్బందిగా అనిపించింది. బోర్‌ ఫీలయ్యాను.  నా తల్లి, సోదరుడు కరోనా బారిన పడడం భయపెట్టింది. నా సోదరుడికి కాస్త సీరియస్ అయింది. అయితే వైద్యుల చికిత్స కారణంగా అతను కోలుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుటపడినట్టు అనిపిస్తుంది` అని రామ్ చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న `రెడ్‌` చిత్రానికి కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు.