Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్, ఇస్మార్ట్ హీరోతో గబ్బర్ సింగ్ డైరెక్టర్ సినిమా..?

టాలీవుడ్ లో ఈ మధ్య ఊహించని కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. ఫలానా హీరోతో... ఫలానా డైరెక్టర్ సినిమానా..? అని ఆశ్చర్య పోయేలా కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా టాలీవుడ్ తెర మీదకు మరో కొత్త వింత కాంబినేషన్ వచ్చింది. 

Hero Ram Movie with Harish Shankar
Author
Hyderabad, First Published May 14, 2022, 11:39 AM IST

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్  సెట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది.  ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని స్టార్ డైరెక్టర్ హరిష్ శంకర్ డైరెక్షన్ లో  పక్కా మాస్ ఎంటర్ టైనర్తెరకెక్కనుందని సమాచారం. రామ్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని పక్కా కమర్శియల్ అంశాలతో అదిరిపోయే స్కిప్ట్ ను రెడీ చేశాడట హరీష్ శంకర్. అయితే అటు రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ మూవీతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 

అయితే ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఇస్మార్ట్ శంకర్  భారీ హిట్ తర్వాత మళ్ళీ అలాంటి మాస్ హిట్ కొట్టాలని రెడ్ సినిమా చేసిన రామ్ కు నిరాశే ఎదురయ్యింది. దాంతో ఈసారి మళ్ళీ అదే ఫార్ములాలో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఇస్మార్ హీరో. ఆప్రయత్నంలో భాగంగానే  కోలీవుడ్ యాక్షన్  సినిమాల డైరెక్టర్ లింగుస్వామి ది వారియర్ అనే యాక్షన్ మూవీని చేస్తున్నాడు. 

తెలుగుతో పాటుగా తమిళంలోనూ ది వారియర్ మూవీ రిలీజ్ కాబోతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో పక్కాగా హిట్ కొట్టాలని రామ్ అనుకుంటున్నారు.  అయితే ఇది వర్కైట్ అయినా కాకపోయినా.. మరో రెండు మాస్ సినిమాలు ఒప్పుకుంటే బెటర్ అనుకున్నాడో ఏమో.. ఊర మాస్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఎనర్జిటిక్ స్టార్ ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  హీరోగా హరీష్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్ సినిమా అనౌన్స్ చేసి ఉన్నాడు.  జూలై నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాలో పవన్ సరసన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతుంది. దీని తర్వాత రామ్ - హరీష్ శంకర్‌ల సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

అటు రామ్ కూడా ఈలోపు బోయపాటి శ్రీనుతో సినిమాను కంప్లీట్ చేయాలి అని చూస్తున్నాడు. ఈ మూడు సినిమాలలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినా.. రామ్ కు మరోసారి కెరిర్ టర్న్ అయినట్టే.. అయితే బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు రామ్. మరి రామ్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. అయితే రామ్, హరీష్ శంకర్ మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios