ఓ అభిమాని కారణంగా టాలీవుడ్ హీరో రామ్, నటి ఛార్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా సక్సెస్ కావాలని సందీప్ అనే అభిమాని తిరుమల మెట్లను మోకాళ్లతో ఎక్కారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇది చూసిన రామ్ ఎమోషనల్ గా స్పందించారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 

అందులో.. 'డియర్ సందీప్.. నీ వీడియో చూశాను. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నా.. నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది.. బాధించింది.. షాక్ కి గురి చేసింది. మీరు ఇంత ప్రేమ, అభిమానం నాపై చూపించడానికి అంతగా నేనేం చేశానో అర్ధం కావడం లేదు.

కానీ మీలాంటి వారి కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది'' అంటూ రాసుకొచ్చాడు. సదరు అభిమాని మోకాలిపై మెట్లు ఎక్కుతున్నవీడియో షేర్ చేసిన ఛార్మి.. 'నువ్ నన్ను ఏడిపించేశావ్ సందీప్' అని ఎమోషనల్ అయింది.