యంగ్ హీరో నితిన్ ఇప్పుడు జెట్ స్పీడ్ మీద దూసుకుపోతున్నాడు. వరుసగా కొత్త ప్రాజెక్ట్ లు మొదలుపెడుతూ బిజీ హీరోగా మారుతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమా చేస్తోన్న ఈ హీరో వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేయాలని గ్యాప్ కూడా తీసుకోవడం లేదు.

అలానే రీసెంట్ గా భవ్య బ్యానర్ పై చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాకి ముహూర్తం చేసేశాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక వెంకీ అట్లూరితో మరో సినిమా చేయబోతున్నడనే సంగతి తెలిసిందే. 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు నితిన్. అదేంటంటే.. 'రంగ్ దే'.

ఈ టైటిల్ ఎక్కడ నుండి తీసుకున్నాడో అందరికీ తెలిసిందే.. నితిన్ హిట్ చిత్రాల్లో ఒకటైన 'అ ఆ' సినిమాలో సూపర్ హిట్ సాంగ్ 'రంగ్ దే' నే ఇప్పుడు  సినిమాకు టైటిల్ గా మారింది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు నితిన్.