Asianet News TeluguAsianet News Telugu

'చెప్పు తెగుద్ది ఎదవా'... అమెరికా అధ్యక్షుడిని అంత మాట అనేశావేంటి నిఖిల్!

ప్రపంచ వ్యాప్తంగా అఫ్గాన్ పరిస్థితుల పట్ల మానవతావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని గట్టిగా నమ్మిన నిఖిల్ ట్వీట్ ద్వారా తన ఆక్రోషం వెళ్లగక్కారు. 

hero nikhil sensational tweet on america president
Author
Hyderabad, First Published Aug 25, 2021, 8:19 PM IST

యంగ్ హీరో నిఖిల్ ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడుని ఉద్దేశిస్తూ నిఖిల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నిఖిల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, సంచలనంగా మారింది. కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్ ఆధీనంలోకి వెళ్ళింది. దీనితో ప్రాణ భయంతో ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈ క్రమంలో ఆడవాళ్లు, చిన్న పిల్లలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 


ఇప్పటికే అనేక మంది అమాయక ప్రజలు కాల్పులలో, తొక్కిసలాటలలో, విమానంపై నుండి జాలువారి మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా అఫ్గాన్ పరిస్థితుల పట్ల మానవతావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి ఈ పరిస్థితికి అమెరికానే కారణం అని గట్టిగా నమ్మిన నిఖిల్ ట్వీట్ ద్వారా తన ఆక్రోషం వెళ్లగక్కారు. నిఖిల్ తన ట్వీట్ లో...''20ఏళ్ళు ఓ దేశాన్ని మీరు అనేక ఇబ్బందులకు గురి చేశారు. చివరికి ఇలా వదిలేశారు. మరోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే మిస్టర్ బైడెన్, చెప్పు తెగుద్ది ఎదవ'' అని కామెంట్ చేశారు. 


అమెరికా దళాలు అఫ్గాన్ నుండి నిష్క్రమించడం వలెనే, ఆ దేశం తాలిబన్స్ హస్తగతం అయ్యింది. ఇదే భావనను తెలియజేస్తూ నిఖిల్ చాలా ఘాటుగా అమెరికా అధ్యక్షుడిని తిడుతూ ట్వీట్ చేశారు. ఇక నిఖిల్ ట్వీట్ పై నెటిజెన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆయనను సమర్దిస్తుంటే, మరి కొందరు సెలెబ్రిటీ హోదాలో ఉంది, ఇలాంటి భాష వాడడం సరికాదని అంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios