యంగ్‌ హీరో నిఖిల్‌ ఇటీవల లాక్‌ డౌన్‌ టైమ్‌లో పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటరయ్యాడు. తన ప్రియురాలు, డాక్టర్‌ పల్లవి వర్మని పెళ్ళి చేసుకున్న తర్వాత ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఆ జోష్‌ని మరో రూపంలో చాటుకున్నాడు నిఖిల్‌. 

తాజాగా ఆయన సిక్స్ ప్యాక్‌ తరహా బాడీ లుక్‌లో ఓ ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. సూపర్‌డ్రై అనే స్టయిలీస్ట్ సంస్థ తయారు నిఖిల్‌ని స్టయిలీస్‌గా తయారు చేసింది. సూపర్‌డ్రై బాడీతో ఔట్‌ఫిట్‌గా కనిపిస్తూ నిఖిల్‌ ఆకట్టుకుంటున్నాడు. డిఫరెంట్‌ ఎయిర్‌ స్టయిల్‌, స్టయిలీష్‌ డ్రెస్‌తో అలరిస్తున్నాడు. ఈ లుక్ వెనకాల చాలా మందే శ్రమించారట. స్టయిలీస్ట్ రష్మిత తాప, షాట్‌ తీసింది అడ్రిన్‌ సెక్వెరా, హెయిర్‌ స్టయిలిస్ట్ డీపర్‌సేలూన్‌, మేకప్‌ రాధికాదేవ్‌ పనిచేశారు. 

తాజాగా ఈ ఫోటోని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం ఇది విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గతేడాది `అర్జున్‌ సూరవరం`తో మంచి విజయాన్ని అందుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చిన నిఖిల్‌ ప్రస్తుతం `కార్తికేయ 2`, `18పేజెస్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు.