జాతి రత్నాలు మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి భావోద్వేగానికి గురయ్యారు. జాతి రత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ ని గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఎమోషనల్ అవుతున్న నవీన్ ని భుజం తడుతూ నాగ్ అశ్విన్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూ ఏజ్ కామెడీ ఎంటర్టైనర్ జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో జాతి రత్నాలు థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కనబడుతున్నాయి. ఇక ఈ మూవీలోని కామెడీ మరియు నటుల పెర్ఫార్మన్స్ ని టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తున్నారు. అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఇంతలా నవ్వలేదని జాతి రత్నాలు మూవీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇక జాతి రత్నాలు మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి భావోద్వేగానికి గురయ్యారు. జాతి రత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ ని గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఎమోషనల్ అవుతున్న నవీన్ ని భుజం తడుతూ నాగ్ అశ్విన్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా మహేష్ జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి నటనను ఆకాశానికి ఎత్తాడు. మహేష్-సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన వన్ మూవీలో ఓ చిన్న పాత్ర చేసిన నవీన్ పోలిశెట్టితో ఆ సమయంలో నేను మాట్లాడాడాను. అతని కమిట్మెంట్, డెడికేషన్ అప్పటి నుండే నాకు తెలుసు అన్నారు మహేష్. అలాగే నవీన్ పోలిశెట్టిలో ఓ స్పార్క్ ఉందంటూ పొగడం మరో విశేషం. అలాగే జాతి రత్నాలు టీమ్ మొత్తానికి మహేష్ బెస్ట్ విషెస్ మరియు కంగ్రాట్స్ చెప్పారు.
మహేష్ లాంటి టాప్ స్టార్ తన గురించి పొగడంతో నవీన్ పోలిశెట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీలాంటి నటుల సినిమాలు చూస్తూ పెరిగాం... మా స్ఫూర్తి మీరే అంటూ కృతజ్ఞతలు తెలిపాడు నవీన్. నూతన దర్శకుడు అనుదీప్ జాతి రత్నాలు చిత్రాన్ని తెరకెక్కించగా... రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు.
