Asianet News TeluguAsianet News Telugu

ఆగిపోయిన మరో నాని సినిమా?.. కారణం ఏంటంటే?.. ఫ్యాన్స్ లో ఆందోళన

నేచురల్‌ స్టార్‌ నాని అంటే మినిమమ్‌ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మారింది. వరుసగా సినిమాలు ఆగిపోతున్నాయి.
 

hero nani one more movie shelved ? reason here arj
Author
First Published Jun 17, 2024, 10:30 AM IST

నేచురల్‌ స్టార్‌ నాని రేంజ్‌ ఇటీవల పెరిగింది. `దసరా` చిత్రంతో ఆయన మార్కెట్‌ మాత్రమే కాదు, ఇమేజ్‌ కూడా పెరిగిపోయింది. ఈ మూవీ సుమారు వందకోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన `హాయ్‌ నాన్న` కూడా డివైడ్‌ టాక్‌ వచ్చినా దాదాపు 70, 80కోట్లు కలెక్షన్లని రాబట్టింది. దీంతో నాని టైర్‌ 2 హీరోల్లో టాప్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో `సరిపోదా శనివారం` సినిమాలో నటిస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తన రూట్‌ మార్చి మాస్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రాబోతుంది. 

ప్రస్తుతం నాని చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. `బలగం` వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. విలేజ్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ మూవీ ఇది.దీంతోపాటు సుజీత్‌ దర్శకత్వంలో మరో మాఫియా బేస్డ్ మూవీ చేయబోతున్నాడు. అలాగే `దసరా`దర్శకుడితోనూ మరో సినిమా ప్లానింగ్‌ ఉంది. దీంతోపాటు ఓ కొత్త డైరెక్టర్‌ తోనూ సినిమా చర్చలు నడిచాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నానికి షాక్‌ ల మీద షాక్‌ తగులుతుంది. ఇప్పటికే సుజీత్‌ మూవీ ఆగిపోయిందని అంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మించాల్సిన ఈ సినిమా బడ్జెట్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో దానయ్య బ్యాక్‌ అయ్యారట. నాని 30కోట్ల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారని, దీని కారణంగా సినిమాకి సుమారు 80కోట్ల బడ్జెట్‌ అవుతుందని, నానిపై ఇంత బడ్జెట్‌ కష్టమని భావించిన నిర్మాత వెనక్కి తగ్గాడట. దీంతో ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయిందని అంటున్నారు. 

ఇప్పుడు మరో షాక్‌ తగిలింది. మరో సినిమా కూడా ఆగిపోయిందంటూ రూమర్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. `బలగం` సినిమాతో ట్రెండ్‌ మార్చేసిన వేణు యెల్దండి దర్శకత్వంలో నాని ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. దిల్‌ రాజు ఈ మూవీని నిర్మించబోతున్నారు. తాజాగా ఈ సినిమా కూడా క్యాన్సిల్‌ అయ్యిందట. స్టోరీ నచ్చక పక్కనపెట్టారట నాని. దీంతో దిల్‌రాజు కూడా వద్దు అనే నిర్ణయానికి వచ్చారట. అయితే మరేదైనా కొత్తకథ వస్తే ఈ కాంబినేషన్‌లో మూవీఉంటుందని, లేదంటే ఇక పూర్తిగా క్యాన్సిల్‌ కాబోతుందని తెలుస్తుంది. ఇలా వరుసగా నాని సినిమాలు ఆగిపోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయి. మరి ఈ విషయంలో నాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios