Asianet News TeluguAsianet News Telugu

గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న నాని మాస్‌ లుక్‌.. దసరా మూవీ నుంచి రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సింగిల్

నేచురల్ స్టార్ నానీ ఈ సారి పట్టుదలతో ఉన్నాడు. ఎలాగైనా హిట్ కొట్టేస్తాను అంటున్నాడు. అందులో భాగంగానే దసరా మూవీతో రాబోతున్నాడు నానీ. ఈ మూవీపై క్యూరియాసిటీ పెంచడానికి సరికొత్త ప్లాన్స్ వేస్తున్నాడు. 

Hero Nani Dasara Movie First Single Release Date
Author
First Published Oct 1, 2022, 1:54 PM IST

సక్సెస్.. ఫెయిల్యూర్.. ఏదైనా కాని.. వాటితో సంబంధం లేకుండా ఆడియన్స్ కు ఏదైనా కొత్తగా చూపించాలి అని తాపత్రేయంతో  సినిమాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఆడియన్స్ కు కొత్త  క‌థ‌ల‌ను  ప్రయోగాత్మకు సినిమాలను చూపించాలకునే అతికొద్ది మంది న‌టుల‌లో నాని ఒక‌డు. ప్రస్తుతం నాని మాస్‌ ఆడియెన్స్‌లో క్రేజ్‌ తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే దసరా మూవీలో అదిరిపోయే లుక్ తో మెస్మరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. 

నేచురల్ స్టార్ రీసెంట్ గా నటించిన అంటే సుంద‌రానికీ రిలీజ్ అయ్యి ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. మంచి ప్రయత్నంగా నిలిచిపోయిన ఈసినిమా.. కమర్షియల్ గా మాత్రం డిస్సపాయింట్ చేసింది. నానీకి ఈ మధ్య  ఒక సక్కెస్ వస్తే.. ఒక ప్లాప్ వస్తోంది.  నాని సినిమాల‌కు టాక్ బాగానే వ‌స్తున్నా.. అవి క‌మ‌ర్షియ‌ల్‌గా బ్లాక్‌ బస్టర్‌ విజయాలు సాధించలేక పోతున్నాయి. నిజానికి నాని నటించిన గత ఐదారు చిత్రాలు కూడా కలెక్షన్ల పరంగా యావరేజ్‌గానే మిగిలాయి. 

నానీకి ప్రయోగాలు అచ్చిరావడంలేదు. అయినా సరే తాడో పేడో తేల్చుకునే పనిలోనే ఉంటున్నాడు నేచురల్ స్టార్. వరుసగా సరికొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నాడు ఇందులో భాగంగానే ద‌స‌రా సినిమాతో రాబోతున్నాడు. ఈమూవీలో ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఊరమాస్ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. గ‌తంలో ఎన్నడు చేయ‌లేని అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. దసరా సినిమాతో ఈసారి ఎలాగైనా మాస్ ఫాలోయింగ్‌ను .. మాస్ ఇమేజ్ ను సాధించాలని ట్రై చేస్తున్నాడు. 

 

శ్రీకాంత్‌ ఓదెలా  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్  ప్రస్తుతం  సూపర్ ఫాస్ట్ గా జరుపుకుంటుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దసరా సినిమా నుంచి  పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌చేశాయి. రీసెంట్ గా  మరో క్రేజీ అప్‌డేట్‌ ను ఆడియన్స్ కోసం రెడీ చేస్తున్నారు టీమ్. ఇప్పటికే నానీ సర్ ప్రైజింగ్ లుక్ తో సినిమాపై ఆసక్తి పెంచారు. 

దసరా మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ పాటను అక్టోబర్‌ ౩న రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ అనౌన్స్ మెంట్ ను కోసం  ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని ఊరమాస్‌  లుక్ లో అదరగోడుతున్నాడు. ఇంత వరకూ నానీని ఇలాంటి లుక్ లో చూసింది లేదు. దాంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుంది. నానీతో పాటు కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో కనిపించబోతుంది.ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈసినిమాకు  సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios