పొలిటికల్ హీట్.. పార్టీ పెట్టిన నాని.. ప్రచారంలో నేచురల్ స్టార్ బిజీ.!
ప్రస్తుతం తెలంగాణ అంతటా ఎన్నికల జోరే కనిపిస్తోంది. దీంతో నాని కూడా కండువా కప్పుకొని ప్రచారానికి దిగాడు. మరికొద్దిరోజుల్లో రానున్న చిత్రాన్ని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలజోరు జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా కడువాలు, పార్టీ జెండాలు, ప్రచారాలే కనిపిస్తున్నారు. ప్రజల అటెన్షన్ మొత్తం ఆయా పార్టీల ప్రచారాలపైనే ఉంది. దీంతో టాలీవుడ్ స్టార్స్ పొలిటికల్ హీట్ ను తమ సినిమాలకు ఉపయోగించుకుంటున్నారు. మొన్న దర్శకుడు అనిల్ రావిపూడి పార్టీ పెడుతానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆహాతో కలిసి ఓ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. ఇక తాజాగా నాని కండువా కప్పుకొని మీ ఓటు నాకే అంటూ ‘హాయ్ నాన్న’ ప్రచారంలోకి దిగారు.
రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు నేచురల్ స్టార్ నాని (Nani). చివరిగా ‘దసరా’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బ్యూటీఫుల్ లవ్, ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాని నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’ (Hai Nanna). శౌర్యూవ్ దర్శకత్వం వహించారు. బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటించారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ముందుగా ప్రకటించిన డేట్ కంటే పదిహేను రోజులు ముందుగానే డిసెంబర్ 7న విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా ఇరవై రోజులుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఈ సందర్భంగా నాని వినూత్నంగా సినిమాను ప్రచారం చేస్తున్నారు. ‘హాయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్. డిసెంబర్ 7న మీ ప్రేమ మరియు ఓటు మాకే ఉండాలి‘ అంటూ ఆడియెన్స్ ను కోరుతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయ నాయకుడిగా నాని ఇచ్చిన స్టిల్ ఆకట్టుకుంటోంది. తన సినిమాపై ఫోకస్ పెంచేందుకు ఉపయోగపడుతోంది.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. అలాగే హేషమ్ అబ్దుల్ అందిస్తున్న సాంగ్స్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కు మ్యూజిక్ లవర్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. త్వరలో నాని స్ట్రేట్ గా ప్రమోషన్స్ లో దిగనున్నారు.