టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు ఎలాంటి డ్రెస్ ధరించినా అందంగానే ఉంటారు. తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న మహేష్ షర్ట్ చర్చకు దారి తీసింది.
హాలీవుడ్ రేంజ్ కట్ అవుట్ మహేష్ బాబు సొంతం. చక్కని రూపానికి తోడు ఒడ్డుపొడుగు ఉన్న హీరో. ఇక ఆయన ఫ్యాషన్ ఐకాన్ కూడా. పలు గార్మెంట్స్ బ్రాండ్స్ కి మహేష్ ప్రచారకర్తగా ఉన్నారు. మహేష్ ధరించే బట్టల మీద కూడా ఫ్యాన్స్ రీసెర్చ్ చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు బిగ్ సీ సంస్థ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో పాల్గొన్నారు. మొబైల్ రిటైల్ చైన్ బిగ్ సి ఈ వ్యాపారంలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న క్రమంలో తమ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అనేక విషయాల మీద స్పందించారు. గుంటూరు కారం సినిమా చెప్పినట్లే సంక్రాంతికి విడుదల అవుతుందని వెల్లడించారు. అలాగే సితార బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం సంతోషం అన్న ఆయన, తన సామాజిక సేవా కార్యక్రమాలు గురించి వెల్లడించారు. ఇక తనకు కూడా మొబైల్ వ్యసనంగా మారిందని. ఉదయాన్నే లేవగానే మొబైల్ చూస్తానని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ కలిగిన చెక్స్ షర్ట్ ధరించారు. సింప్లీ సూపర్బ్ గా ఉన్న ఆ షర్ట్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. మహేష్ ధరించి ఆ షర్ట్ ధర ఎంతని గూగుల్ లో సెర్చ్ చేశారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ కి చెందిన ఆ షర్ట్ ధర రూ. 18 వేలు అని తెలిసింది. మహేష్ రేంజ్ కి అది సాధారణమే. కానీ మనలాంటి వాళ్లకు చాలా ఎక్కువ.
మధ్య తరగతి వాళ్ళైతే ఏడాదికి సరిపడా బట్టలు ఆ డబ్బుతో సమకూర్చుకుంటారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం షెడ్యూల్ ఇటీవల మొదలైంది. రూ. 4 కోట్లతో ఓ సెట్ వేశారని సమాచారం. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మహేష్ రాజమౌళి మూవీతో బిజీ కానున్నాడు.
