సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రానికి ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పై షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.   

స్టార్ లీగ్ లో ఉన్న హీరోలందరూ రూ. 50 కోట్ల మార్క్ దాటేశారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే యాభై కోట్లు తీసుకుంటున్నారు. వీరిద్దరూ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరలేదు. టాప్ స్టార్స్ అయినప్పటికీ ఇండియాలో మార్కెట్ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కాబట్టి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, పుష్ప మూవీ అనంతరం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారు. 

అల్లు అర్జున్ పుష్ప 2కి రూ. 80 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా తమ అప్ కమింగ్ చిత్రాలు గేమ్ చేంజర్, దేవరకు రూ. 70 కోట్లకు పైనే తీసుకుంటున్నారు. ప్రభాస్ ఎప్పుడో వంద కోట్లు దాటేశాడు. అయితే పాన్ ఇండియా మూవీ చేయకున్నా మహేష్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. 

దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం చిత్రానికి మహేష్ రెమ్యూనరేషన్ రూ. 78 కోట్లు అంటున్నారు. మళ్ళీ దానికి జీఎస్టీ అదనం అంటున్నారు. కాబట్టి మహేష్ బాబు దాదాపు వంద కోట్లు తీసుకున్నట్లే లెక్క. మహేష్ బాబుకు తెలుగు రాష్రాలతో పాటు యూఎస్ లో భారీ మార్కెట్ ఉంది. మహేష్ ప్లాప్ చిత్రాలు కూడా యూఎస్ లో మిలియన్ డాలర్స్ ఈజీగా రాబట్టేస్తాయి. 

ఈ క్రమంలో మేకర్స్ అడిగినంత ఇస్తున్నారట. ఇక గుంటూరు కారం చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే షూటింగ్ అనుకున్న ప్రకారం సాగడం లేదు. దాంతో సంక్రాంతికి రావడం కష్టమే అంటున్నారు.