సూపర్ స్టార్ మహేష్ సడన్ గా ఫారిన్ వెళ్లనున్నారట. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న కుటుంబాన్ని ఆయన కలుసుకోనున్నారట. ఈ ట్రిప్ కోసం షూటింగ్ కూడా పక్కన పెట్టేశాడనే వాదన వినిపిస్తోంది.  

ఎస్ఎస్ఎమ్బి 28 ఇప్పటికే ఆలస్యమైంది. పలు కారణాలతో అనుకున్న సమయానికి మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. 2023 సమ్మర్ కి విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అది కాస్తా 2024 సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. రిలీజ్ కి చాలా సమయం ఉన్నప్పటికీ సమ్మర్ చివరికల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని చూస్తున్నారట. 

దీని కోసం వరుస షెడ్యూల్స్ తో నిరవధికంగా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి హీరో మహేష్ బాబు విదేశాలకు వెళుతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నమ్రత శిరోద్కర్ పిల్లలు సితార, గౌతమ్ లతో ఫ్రాన్స్ లో ఉన్నారు. మహేష్ బాబు వారితో టూర్ లో జాయిన్ అయ్యేందుకు అక్కడకు వెళుతున్నారట. పిల్లలపై బెంగ పెట్టుకున్న మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కూడా పక్కన పెట్టి ఈ ట్రిప్ కి వెళుతున్నాడని అంటున్నారు. 

ఓ రెండు వారాల క్రితం మహేష్ బాబు ఫ్యామిలీ ఫ్రాన్స్ వెళ్లారు. సాధారణంగా ఎక్కడికెళ్లినా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కలిసే వెళతారు. ఏడాదికి ఖచ్చితంగా ఐదారు విదేశీ టూర్స్ ప్లాన్ చేస్తారు. ఈసారి మహేష్ బాబు లేకుండానే నమ్రత తన ఇద్దరు పిల్లలతో ఫారిన్ వెళ్లారు. ఇక మహేష్ బాబు సడన్ ట్రిప్ కారణంగా త్రివిక్రమ్ మూవీ షూటింగ్ డిస్టర్బ్ అవుతుందని సమాచారం. 

SSMB 28 ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. మిర్చి యార్డులో మహేష్ స్టైల్ గా నడిచొస్తున్న మాస్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో మూవీ రావడం విశేషం.