శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుండి చంద్రయాన్ 3 విజయవంతంగా ఆకాశంలోకి దూసుకుపోయింది. దేశం ఈ కీలక ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా హీరో మహేష్ బాబు స్పందించారు.  

జాబిలిపై ప్రయోగాల్లో భాగంగా భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. చంద్రుడిపై రోవర్ సాఫ్ట్ లాండింగ్ కావల్సి ఉండగా చివరి క్షణంలో కమ్యూనికేషన్ బ్రేక్ అయ్యింది. అంతా అనుకున్నట్లు జరుగుతుందని అనుకుంటుండగా, అనుకోని ఉపద్రవం ఎదురైంది. చంద్రయాన్ 2 ఆచూకీ తెలియకుండా పోయింది. ఇస్రో టీమ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్ 3 ప్రయోగానికి భారత్ సిద్ధమైంది. 

నేడు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ని 'ఎల్ వి ఏం 3' లాంచ్ వెహికల్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ప్రవేశ పెట్టింది. చంద్రయాన్ మిషన్ మొదటి దశ విజయవంతం కాగా ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంపై హీరో మహేష్ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించినందుకు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాను. ఆకాశంలో ఉన్నత శిఖరాలవైపు దూసుకుపోతున్నాము. ఇస్రో టీం కి నా అభినందనలు. అలాగే శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది... అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్ వైరల్ అవుతుంది. చంద్రునిపై ప్రయోగాల్లో భాగంగా భారత్ చంద్రయాన్ 1, 2 ప్రయోగాలు చేపట్టింది. తాజాగా చంద్రయాన్ 3తో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. 

కేవలం రాజమౌళి సినిమా బడ్జెట్ తో మనం అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాం. ఇతర దేశాల స్పేస్ క్రాప్ట్స్ అంతరిక్షంలోకి తీసుకెళుతూ ఆదాయం ఆర్జిస్తున్నాము. చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో పెట్టిన ఖర్చు కేవలం రూ. 615 కోట్లు. ఇది ఆదిపురుష్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ అని చెప్పొచ్చు. 

Scroll to load tweet…