ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదిలా ఉండగా కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్. ఈ చిత్రంలో కార్తీ డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా అదరగొట్టాడు. 

హిట్ సినిమాకి సీక్వెల్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారిపోయింది. హీరో కార్తీ కూడా కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదిలా ఉండగా కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్. ఈ చిత్రంలో కార్తీ డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా అదరగొట్టాడు. 

మిత్రన్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ డ్రామా ఆడియన్స్ ని బాగా అలరించింది. కాగా నేడు ఈ చిత్ర సీక్వెల్ ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సీక్వెల్ కూడా మిత్రన్ దర్శకత్వంలోనే ఉండబోతోంది. జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

సర్దార్ చిత్రంలో కార్తీ పోలీస్ అధికారిగా నటించాడు. తండ్రి పాత్రలో ఇండియాకి పనిచేసే స్పై ఏజెంట్ గా అదరగొట్టేశాడు. యాక్షన్ ఫీస్ట్ అందిస్తూనే మంచి సందేశం కూడా ఇచ్చారు. ప్లాస్టిక్బి బాటిల్స్ పై ఈ చిత్రంతో పెద్ద చర్చే జరిగింది. 

Scroll to load tweet…

ఇప్పుడు సీక్వెల్ ని మరింత భారీ బడ్జెట్ లో భారీ సెట్స్ మధ్యలో చిత్రీకరించబోతున్నారట. అదే విధంగా అజర్బైజాన్, కజకిస్తాన్, జార్జియా దేశాల్లో కూడా షూటింగ్ జరగాల్సి ఉంది. సర్దార్ 2 పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారాయి.