హీరో సూర్య తరహాలో తన సోదరుడు కార్తీ కూడా తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కార్తీ చివరగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2తో ఘనవిజయం అందుకున్నాడు.
హీరో సూర్య తరహాలో తన సోదరుడు కార్తీ కూడా తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కార్తీ చివరగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2తో ఘనవిజయం అందుకున్నాడు. ప్రస్తుతం కార్తీ రాజు మురుగన్ దర్శకత్వంలో జపాన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు కూడా టీం ప్రకటించింది. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఇష్టపడే కార్తీ జపాన్ చిత్రంలో కూడా అదే తరహా రోల్ ప్లే చేసినట్లు ఉన్నాడు.
టీజర్ మంచి ఫన్ జనరేట్ చేస్తూ, సస్పెన్స్ ని కూడా పెంచుతోంది. చూస్తుంటే స్పైథ్రిల్లర్ మూవీ తరహాలో అనిపిస్తోంది. 'వాడు పాప క్షమాపణకి అతీతుడు ఫాదర్, ప్రభువు యొక్క అద్భుతమైన సృష్టిలో వాడు హీరో ఫాదర్' అంటూ చర్చిలో ఒక వ్యక్తి కార్తీ గురించి ఎలివేట్ చేసే విధంగా డైలాగ్స్ చెబుతాడు.
మరో వ్యక్తి వీడొక కామెడీ పీస్ అంటూ కార్తీ గురించి చెప్పడం చూడొచ్చు. మీరంతా అనుకున్నట్లు కాదు.. వాడు దూల తీర్చే విలన్ అంటూ సునీల్ మరోరకంగా కార్తీ గురించి చెబుతాడు. అసలు ఇంతకీ జపాన్ ఎవరు అనే ఉత్కంఠ నడుమ.. ఎవర్రా నువ్వు అని ప్రశ్నించగా.. జపాన్ మేడిన్ ఇండియా అంటూ కార్తీ కామెడీగా బదులివ్వడం ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా జపాన్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.
ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

