ధనుష్ 50వ చిత్రం రాయన్. ఈ చిత్రం విడుదలకు సిద్ధం కాగా ట్రైలర్ విడుదల చేశారు. రాయన్ ట్రైలర్ ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా ఉంది.. ట్రైలర్ లో హైలెట్ ఏమిటంటే? 

కెరీర్ బిగినింగ్ లో విమర్శలు ఎదుర్కున్న ధనుష్ పట్టుదలతో స్టార్ గా ఎదిగాడు. ధనుష్ కి మంచి నటుడనే పేరుంది. జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన సబ్జక్ట్స్ ట్రై చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటాడు. ధనుష్ 50వ చిత్రం రాయన్. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కావడం విశేషం. రాయన్ మూవీ జులై 26న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ ఈ చిత్రంలో కీలక రోల్ చేశాడు. ఆయన చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేశాడు. అడవిలో సింహం, పులి కంటే ప్రమాదమైన జంతువు తోడేలు. అవి గుంపుగా జతకట్టి సింహాన్ని ఓడిస్తాయని... అని చెప్పడం రాయన్ కథపై హింట్ ఇస్తుంది. ఒంటరిగా యుద్ధం చేసే రాయన్ ని ఓడించేందుకు ప్రత్యర్థులు కాచుకుని కూర్చుంటారు. ఓ ప్రాంతంలో జరిగే ఆధిపత్య పోరే రాయన్ మూవీ కథ. 

ధనుష్ మరోసారి డిఫరెంట్ లుక్ ట్రై చేశాడు. జట్టు లేకుండా షేవ్ చేసిన తలతో ధనుష్ మాస్ అప్పీల్ అదిరింది. ట్రైలర్ లో ధనుష్ లుక్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అని చెప్పాలి. ఎమోషన్, యాక్షన్ కలగలిపి రాయన్ తెరకెక్కించారు. ఎస్ జే సూర్య ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్... ధనుష్ అనుచరుడిగా ప్రాధాన్యత ఉన్న రోల్ చేశాడు. 

రాయన్ చిత్రంలో సురారై పోట్రు ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు. రాయన్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మరి యాభయ్యో చిత్రంతో ధనుష్ ఎంత పెద్ద విజయం సాధిస్తాడో చూడాలి.. 

YouTube video player