ఇటీవల ప్రముఖ నటుడు దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మీ మధ్య మళ్లీ గొడవలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం ట్విట్టర్ లో ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. విజయలక్ష్మి దర్శన్ పేరుతో ఉన్న ట్విట్టర్ లో ఖాతా నుంచి దర్శన్ అనే పదాన్ని తొలగించడంతో ఈ పుకార్లకు కారణమైంది.

అయితే ఈ వదంతులను నమ్మొద్దని సోమవారం నాడు ఆమె ట్వీట్ చేశారు. అయితే ఇద్దరి మధ్య ఏదో వివాదం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చడం తెలిసిందే.

ఇటీవల విడుదలైన యాజమాన సినిమా మేకింగ్ వీడియోలో ఇద్దరూ కలిసి కనిపించారు.  దాంతో ఇద్దరూ సంతోషంగానే ఉన్నారని అభిమానులు అనుకునేలోపు మళ్లీ ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. 

వీరిద్దరి మధ్య గొడవలను సరిదిద్దడానికి ఓ నటుడు, రాజకీయనాయకుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గొడవలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి ఈ జంట మధ్య ఉన్న గొడవలు ఎప్పుడు తొలగిపోతాయో చూడాలి!