బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆయన అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ సెలబ్రిటీ అడ్వొకేట్ గా ఎంపికయ్యారు. పిల్లల హక్కలు, సంరక్షణ విషయమై ఇండియాలో యూనిసిఫ్ ప్రతినిధిగా ఆయన ఎంపికయ్యారు. ఇండియాలో యూత్ ఐకాన్ గా ఉన్న ఆయుష్మాన్ ఖురానా బాలల హక్కుల సంరక్షణ మరియు అవగాహన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. గ్లోబల్ గా ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్ యూనిసెఫ్ తరపున బాలల హక్కుల సంరక్షణ ప్రతినిధిగా ఉన్నారు. 

యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్ ఈ విషయాన్ని తెలియజేశారు. విలక్షణ నటుడిగా అధ్బుత పాత్రలు చేసిన ఆయుష్మాన్ ఖురానా బాలల హక్కుల సంరక్షణ సెలిబ్రిటీ అడ్వొకేట్ గా నియమితులు కావడం సంతోషకరం అన్నారు. యూత్ లో మంచి పాపులారిటీ ఉన్న ఆయుష్మాన్ బాలల హక్కుల సంరక్షణపై ప్రజల్లో మంచి అవగాహన, చైత్యనం తీసుకువస్తారని ఆయన అన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థుతులలో బాలల హింస అరికట్టడంలో ఆయుష్మాన్ పాత్ర చాల కీలకం కానుందని అన్నారు. 

ఇక యూనిసిఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వొకేట్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ప్రతి ఒక్కరు మంచి జీవితం అనుభవించే హక్కు కలిగి ఉన్నారు. ఇంట్లో మన పిల్లలు ఎంత ఆనందకర జీవితం గడుపుతున్నారో, మిగతా పిల్లలు కూడా అదే జీవితం గడపాలి. యూనిసిఫ్ తరపున బాలల సంరక్షణకు పాటు పడతానని ఆయుష్మాన్ తెలియజేశారు. ఇక ఆయుష్మాన్ లెజెండరీ నటుడు అమితాబ్ తో చేసిన గులాబో సితాబో ప్రైమ్ లో విడుదలైంది.