తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు ఆర్య కానీ ఇటు సాయేషా కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు.

దీంతో అసలు ఈ వార్త నిజమేనా అనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. అయితే తాజాగా హీరో కార్తి చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం ఈ జంట ప్రేమలో ఉన్నారనే విషయం అర్ధమవుతోంది. ఆర్య, సాయేషా ఇద్దరూ కూడా కార్తికి మంచి స్నేహితులు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికి ఆర్యకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆర్య పెళ్లెప్పుడు చేసుకుంటాడని కార్తిని అడిగితే.. ప్రస్తుతం ఆర్య తనమాట వినడం లేదని కేవలం ఒక్కరి మాటే వింటున్నాడని అన్నాడు.

ఆ ఒక్కరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా.. ఆర్య-సాయేషా ప్రేమలో ఉన్నారనే విషయాన్ని కార్తి పరోక్షంగా చెప్పేశాడు. త్వరలోనే ఆర్య-సాయేషా పెళ్లి చేసుకుంటారని టాక్. మరేం జరుగుతుందో చూడాలి!