ఇంట్లోకి మహాలక్ష్మి సక్సెస్‌తో రావడం విశేషం. ఆర్య భార్య, హీరోయిన్‌ సయేషా సైగల్‌ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. శుక్రవారం ఆమె ఆడబిడ్డకి జన్మనిచ్చింది. 

తమిళ హీరో తాజాగా `సర్పట్ట`తో సూపర్‌ హిట్‌ని అందుకున్న ఆర్య ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది. సినిమా హిట్‌ టాక్‌ రావడమే కాదు, ఇంటికి ఆనందాలను తెచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇంట్లోకి మహాలక్ష్మి సక్సెస్‌తో రావడం విశేషం. ఆర్య భార్య, హీరోయిన్‌ సయేషా సైగల్‌ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. శుక్రవారం ఆమె ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ శుక్రవారమే ఆర్య బాక్సర్‌గా నటించిన `సర్పట్ట` చిత్రం విడుదలై సక్సెస్‌ టాక్‌ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. 

ఇక సయేషాకి ఆడబిడ్డ పుట్టిందని హీరో విశాల్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తాను మావయ్య అయ్యానని, చాలా ఎమోషనల్‌గా ఉందని చెబుతూ, ఆర్య, సయేషాలకు అభినందనలు తెలిపారు. `ఈ వార్తని రివీల్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సయేషా ఆడబిడ్డకి జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు చాలా హ్యాపీ. షూటింగ్‌ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. బిడ్డకి దేవుడి ఆశీర్వాదం ఉండాలి` అని ట్వీట్‌ చేశాడు విశాల్‌. ఇదిలా ఉంటే ఆర్య, విశాల్‌ కలిసి ప్రస్తుతం `ఎనిమీ` చిత్రంలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. నేడు(శనివారం) ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. 

Scroll to load tweet…

ఆర్య, సయేషా సైగల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె తెలుగులో అఖిల్‌ సరసన `అఖిల్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత `గజినీకాంత్‌` సినిమాలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మ్యారేజ్‌ చేసుకున్నారు. సయేషా చివరగా సూర్య సరసన `బందిపోటు` చిత్రంలో నటించింది.