అల్లు అర్జున్ వారసుడు అయాన్ బర్త్ డే వేడుకలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ వేడుకల ఫోటోలు స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు.

హీరో అల్లు అర్జున్ కొడుకు అయాన్ చూస్తూనే పెద్దవాడైపోతున్నాడు. ఈ స్టార్ కిడ్ టీనేజ్ కి దగ్గరవుతున్నాడు. అల్లు అయాన్ బర్త్ డే ఏప్రిల్ 3న ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఈ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మిస్ అయినట్లున్నారు. ఈ ఏడాది అయాన్ బర్త్ డే ఫొటోల్లో అల్లు అర్జున్ కనిపించలేదు. 2014 ఏప్రిల్ 3న జన్మించిన అయాన్ 9వ ఏట అడుగు పెట్టాడు. 

కాగా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి 2011లో ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు. పెళ్ళైన మూడేళ్లకు అల్లు అయాన్ పుట్టాడు. అయాన్ పుట్టిన రెండేళ్లకు అర్హ జన్మించింది. ఆమె ప్రస్తుత వయసు 6 ఏళ్ళు. ఈ క్యూట్ ఫ్యామిలీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. 

అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. అరంగేట్రంతోనే అర్హ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. శాకుంతలం మూవీలో అర్హ యంగ్ భరతుడు పాత్ర చేస్తుంది. సమంత కొడుకుగా అర్హ కనిపించనుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ అర్హ మీద ప్రశంసలు కురిపించడం విశేషం. అర్హ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. వందల మంది మధ్య బెరుకు లేకుండా నటించింది అంటూ కొనియాడారు. 

ఏప్రిల్ 14న శాకుంతలం విడుదల కానుంది. ఆ మూవీలో చివరి 15 నిమిషాలు అర్హ పాత్ర ఉంటుందట. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పుష్ప 2 భారీగా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా... రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.