నిఖిల్ స్పై నుండి ఇంట్రెస్టింగ్ లీక్!
కార్తికేయ 2 మూవీతో హీరో నిఖిల్ ఒక్కసారిగా ఫార్మ్ లోకి వచ్చాడు. ఆయన నెక్స్ట్ మూవీ స్పై. ఈ చిత్ర అప్డేట్ ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాగా 18 పేజెస్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా గుర్తింపు తెచ్చుకుంది కానీ థియేటర్స్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఓవర్ ఆల్ గా నిర్మాతలకు లాభాలు పంచింది. 18 పేజెస్ ఓటీటీ హక్కులు భారీ ధరలకు పలికిన నేపథ్యంలో లాభాలు పొందారు.
ఈ జోరులో సెట్స్ పై ఉన్న స్పై మూవీని నిఖిల్ చకచకా పూర్తి చేస్తున్నారు. కార్తికేయ 2 విడుదలకు ముందే నిఖిల్ స్పై టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. కార్తికేయ 2 భారీ విజయం సాధించగా స్పై మూవీకి ప్లస్ కానుంది. ఇండియా వైడ్ స్పై కి మంచి మార్కెట్ దక్కుతుంది. కాగా స్పై మూవీ సెట్స్ నుండి తన లుక్ షేర్ చేశాడు నిఖిల్. అలాగే రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు.
ఫుల్లీ ఆర్మ్డ్ గెటప్ లో స్పై గా నిఖిల్ లుక్ ఆకట్టుకుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా పలు భాషల్లో మీ ముందు రానున్నట్లు కామెంట్ చేశారు. నిఖిల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. గ్యారీ జి హెచ్ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిష్హు సేన్ గుప్తా కీలక రోల్ చేస్తున్నారు.