Asianet News TeluguAsianet News Telugu

జిమ్‌లో మృణాల్ ఠాకూర్ వ‌ర్కౌట్స్... వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు

ఇప్పుడీ ఫ‌న్నీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

Herione Mrunal Thakur shares Funny Gym Video goes Viral
Author
First Published Apr 19, 2024, 12:08 PM IST


ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ, నవ్వుతూ తెరముందు,వెనక ఉండే హీరోయిన్స్ కు,హీరోలకు ఉండే స్టార్డమ్ ఎక్కువ. వారికి లాంగ్ లైఫ్ కెరీర్ లో ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ అభిమానులకు టచ్ లో ఉంటూ ఎప్పుటికప్పుడు వారిని ఎంగేజ్ చేసే వీడియోలు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ జిమ్ వర్కింగ్ వీడియోలకు భలే డిమాండ్. అందులోనూ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ వీడియోలు అయితే చెప్పక్కర్లేదు. తాజాగా  'సీతారామం' హీరోయిన్   మృణాల్ ఠాకూర్‌ ఓ వీడియో షేర్ చేసింది. అది వర్కవుట్ వీడియో క్రిందే కాకుండా ఫన్నీ వీడియోలాగ డిజైన్ చేయటంతో జనం తెగ నవ్వుకుంటున్నారు మీరు ఓ లుక్కేయండి.

ఈ వీడియోలో ఆమె ట్రైన‌ర్‌తో కామెడీ చేయ‌డం మ‌నం చూడొచ్చు.  ఈ వీడియోలో ట్రైన‌ర్ కెమెరాను ఆమెవైపు చూపిన‌ప్పుడ‌ల్లా వెంట‌నే వ్యాయామం చేయ‌డం ప్రారంభిస్తుంది. ట్రైన‌ర్ చూడ‌ని స‌మ‌యంలో వ‌ర్కౌట్స్ ఆపేసి డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మ‌ళ్లీ అత‌డు చూడ‌గానే క‌ష్ట‌ప‌డి వ‌ర్కౌట్ చేస్తున్న‌ట్లు న‌టించ‌డాన్ని ఈ వీడియోలో గ‌మ‌నించవ‌చ్చు. ఇప్పుడీ ఫ‌న్నీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

 మృణాల్ ఠాకూర్‌..  'సీతారామం'  సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ క్రేజీ  హీరోయిన్ గా మారిపోయింది. త‌న‌దైన న‌ట‌న‌, అభిన‌యం, అందంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆమె క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర్వాత రెండో సినిమాలో నేచుర‌ల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న‌'లో జ‌త‌క‌ట్టింది. ఈ మూవీ కూడా హిట్ కావ‌డంతో మృణాల్ క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'ఫ్యామిలీ స్టార్‌'లో న‌టించింది. 

ఇలా వ‌రుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. ఫిట్‌నెస్ విష‌యంలో ఎంతో ఉత్సాహంగా ఉంటూ జిమ్ కు రెగ్యులర్ గా హాజరవుతుంది.  అంతేకాకుండా అప్పుడ‌ప్పుడు జీమ్‌లోని వ‌ర్కౌట్ల తాలూకు ఫొటోలు, వీడియోల‌ను ఆమె అభిమానుల‌తో పంచుకుంటుంది కూడా. ఇదే కోవ‌లో తాజాగా మృణాల్ ఈ  జిమ్ వ‌ర్కౌట్ వీడియో  ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios