సన్నీలియోన్.. ఈ పేరు తెలియని వారుండరు. పోర్న్ స్టార్ గా కెరీర్ ఆరంభించి అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ ను దూరంగా పెట్టి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్, సౌత్ చిత్రాలలో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమెకు 'గేమ్ ఆఫ్ త్రోన్స్' సీజన్ 8 లో నటించే అవకాశం వచ్చింది. 

ఇప్పటికే 7 సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా ఎనిమిదవ సీజన్ ని చిత్రీకరించాబోతున్నారు. ఇందులో నటించమని సన్నీలియోన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. గేమ్ త్రోన్స్ సిరీస్ లలో ప్రతీది కూడా పరిమితికి మించి ఉంటుంది. అది హింసైనా కావొచ్చు.. శృంగారమైనా కావొచ్చు. కొత్తగా రాబోతున్న సిరీస్ లో కూడా శృంగార సన్నివేశాలు మోతాదుకి మించి ఉండడంతో ఈ విషయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసిన సన్నీ.. ఈ షో లో నటించే అవకాశాన్ని వదులుకుంది.

ఇప్పుడిప్పుడే పోర్న్ స్టార్ ఇమేజ్ నుండి బయటపడుతోన్న ఆమెకు ఈ సిరీస్ లో నటిస్తే మళ్లీ భారత్ లోని ప్రేక్షకులు, ఆమె అభిమానులు దూరమైపోయే అవకాశం ఉండటంతో ఈ ఆఫర్ ని వదులుకున్నట్లు సమాచారం. నిజానికి ఈ షోకి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. ఈ సిరీస్ లో నటిస్తే ఆమెకి భారీ రెమ్యునరేషన్ తో పాటు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ భారత్ ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ ఆఫర్ ని వదులుకుంది.