Asianet News TeluguAsianet News Telugu

హాట్ న్యూస్.. బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది, సందడికి సిద్ధం అవ్వండి!

తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. దుమ్మురేపే మజా పంచె రియాలిటీ షో ప్రసారానికి సర్వం సిద్ధమని చెబుతూ హింట్ ఇచ్చేశారు. 
 

here it is most awaited bigg boss Telugu season five promo
Author
Hyderabad, First Published Aug 1, 2021, 1:55 PM IST

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ పై అప్డేట్ వచ్చేసింది. స్టార్ మా లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈసారి బిగ్ బాస్  హౌస్ బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్‌లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే రీతిలో రూపొందించారు. ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది.
 

బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఈ ఇంటికి ఒకటే ప్రవేశ, బయటకు పోవు మార్గాలు ఉండటం మాత్రమే కాదు, అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, సరదాకు దారితీసే పలు మార్గాలూ ఉన్నాయి. ఎన్నో మెళికలు మరెన్నో మలుపులు ద్వారా ఆకట్టుకునే రీతిలో బిగ్‌బాస్ ఈ సారి వినోదం అందించడానికి సిద్ధమయ్యాడు.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5, ఆశ్చర్యానుభూతులను అందించనుంది.


చాలా కాలంగా ప్రచారం అవుతున్నట్లుగా... యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ కంటెస్టెంట్స్ గా పాల్గొననున్నట్లు సమాచారం. ఒకటి అరా పేర్లు మినహా బిగ్ బాస్ సీజన్ 5లో కనిపించేది వీళ్ళే అంటున్నారు. కాగా సింగర్ మంగ్లీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఇటీవల బోనాల సాంగ్ వివాదంలో చిక్కుకున్న ఆమె షోలో పాల్గొనడానికి ఆసక్తికి చూపడం లేదట. అయితే ఎలాగైనా ఆమెను షోలో పాల్గొనేలా చేయాలని నిర్వాహకులు బావిస్తున్నారట. 
 

Follow Us:
Download App:
  • android
  • ios