జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల మరోసారి చేతులు కలపబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ ఎంపికైన సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీ కాబోతున్నారు. ముందుగా ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. 

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల మరోసారి చేతులు కలపబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ ఎంపికైన సంగతి తెలిసిందే. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి 7నే ఈ చిత్ర పూజా కార్యక్రమం జరగాల్సింది. కానీ వాయిదా పడింది. 

ఈ మూవీ లాంచ్ పోస్ట్ పోన్ కావడానికి కారణం ఏంటా అని అంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందుగా ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే రోజున ఎన్టీఆర్, అలియా భట్ ఇద్దరూ అందుబాటులో లేరు. 

ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాల వల్ల ఆరోజు బిజీగా ఉండగా.. అలియా భట్ తన తదుపరి చిత్రం 'గంగూభాయి' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కూడా అలియా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే మరో రోజున ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. కొరటాల శివ తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సామాజిక కోణం ఉండేలా చూస్తున్నారు. ఈ చిత్రంలో విద్యావ్యవస్థపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బస్తీలో పుట్టి పెరిగి మెరిట్ లో విద్యాబ్యాసం పూర్తి చేసిన యువకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడట.