రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ప్రాంతీయ భాషల్లో అద్భుతమైన డైరెక్టర్స్ వెలుగులోకి వస్తున్నారు. ప్రాతీయ భాషా చిత్రాలకు కూడా దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉందని రాజమౌళి, శంకర్ నిరూపించారు. ప్రస్తుతం అదే దారిలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎదుగుతున్నాడు. 

కెజిఎఫ్ చిత్రంతో ప్రశాంత్ ప్రతిభని దేశం మొత్తం చూసింది. ఏ భాషలో అయినా అతడితో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అతడి క్రేజ్ గమనించిన మైత్రి మూవీస్ నిర్మాతలు ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసినట్లు తెలిసింది. మైత్రి మూవీస్ వద్ద మహేష్ డేట్స్ ఉన్నాయి. దీనితో మహేష్ తో ఓ సినిమా చేయాలనీ ప్రశాంత్ ని మైత్రి మూవీస్ వారు కోరారట. 

కానీ ప్రశాంత్ నీల్ మాత్రం జూ. ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని చెప్పాడట. ఎన్టీఆర్ డేట్స్ తీసుకోవాలని మైత్రి నిర్మాతలని కోరినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వద్ద ఉన్న కథ పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ తో కూడుకున్నది. ఆ కథకు మాస్ అప్పీల్ ఉన్న జూ. ఎన్టీఆర్ అయితేనే బావుంటుందని ప్రశాంత్ భావిస్తున్నాడు. 

మహేష్ తో సినిమా చేయాలంటే కథలో కొంత క్లాస్ టచ్ కూడా అవసరం. మహేష్ కు సరిపడే కథ లేనందువల్ల ప్రశాంత్ ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ కి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు.