యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా రానుంది ఉప్పెన. రొమాంటిక్ లవ్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దేవిశ్రీ అందించిన సాంగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.  ఉప్పెన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా సంక్రాంతి కానుకగా ఉప్పెన మూవీ టీజర్ ని విడుదలచేశారు చిత్ర బృందం. 

పేద ధనిక వర్గాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే ప్యూర్ లవ్ డ్రామాగా ఉప్పెన తెరకెక్కింది. టీజర్ లో ముఖ్యంగా హీరోయిన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ''మన మధ్య లవ్ కూడా ఉండ కూడదు... అందుకే పక్కన పెట్టాను'' అన్న డైలాగ్ ఆకట్టుకుంది. కృతి శెట్టి క్యూట్ లుక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయనడంలో సందేహం లేదు. చాలా కాలం తరువాత టాలీవుడ్ లో తెరకెక్కిన సీరియస్ లవ్ డ్రామా ఉప్పెన అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. 

ఉప్పెన మూవీలో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి కీలక రోల్ చేస్తున్నాడు. ఆయనది నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అన్నట్లు సమాచారం అందుతుంది. రాయణం అనే ఊరి పెద్ద పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఉప్పెన టీజర్ లో విజయ్ సేతుపతి ని చూపించలేదు. ఇక గత ఏడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఉప్పెన వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.