15వారాల ఎంటర్టైన్మెంట్ రేపు ముగియనుండగా... బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫైనల్ కోసం వేదిక సరికొత్తగా సిద్ధం అవుతుంది. టాలీవుడ్ స్టార్స్ ఆటలు, పాటల మధ్య హోస్ట్ కింగ్ నాగార్జున ఫినాలేను వైభవంగా నిర్వహించనున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ ఎవరవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత వారమే ఫైనలిస్ట్స్ ఎంపిక కాగా, ఎవరు విన్నర్ కానున్నారనే ఊహాగానాలు మొదలైపోయాయి. ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి రీత్యా మీడియా సంస్థలు విన్నర్ ఎవరనే విషయంపై పోల్స్ నిర్వహించడం జరిగింది. 
 
కాగా బిగ్ బాస్ ఫినాలేకు టాలీవుడ్ నుండి టాప్ స్టార్ గెస్ట్ రావడం ఆనవాయితీగా ఉంది. నాని హోస్ట్ గా జరిగిన సీజన్ 2 ఫినాలే వేదికపైకి గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వచ్చారు. నాగార్జున హోస్ట్ గా ఉన్న సీజన్ 3 ఫినాలేకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రావడం జరిగింది. మరి సీజన్ 4 గెస్ట్ ఎవరనే విషయంపై పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా వేదికను మరింత కలర్ ఫుల్ గా మార్చడానికి యంగ్ హీరోయిన్ మెహ్రీన్, లక్ష్మీ రాయ్ రానున్నారట. అలాగే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రానున్నారని సమాచారం. 
 
లవ్ స్టోరీ మూవీ కోసం జతకట్టిన నాగ చైతన్య, సాయి పల్లవి కూడా బిగ్ బాస్ వేదికపైకి అతిథులు గా రానున్నారని తెలుస్తుంది. మొత్తంగా కింగ్ నాగ్ హోస్ట్ గా ఉన్న వేదికపైకి అబ్బాయి నాగ చైతన్య రావడం విశేషమే అని చెప్పాలి. ఫైనల్ కి అరియనా, అభిజీత్, అఖిల్, సోహైల్ మరియు హారిక చేరుకోగా వీరిలో ఒకరు టైటిల్ అందుకోనున్నారు.