ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన ఫ్యాన్స్ ,సన్నిహితులు ఆందోళన చెందుస్తున్న వేళ, కుమారుడు ఎస్పీ చరణ్ ప్రతి రోజు అప్డేట్ ఇస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వీడియో సందేశం ద్వారా ఎస్పీ చరణ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఇచ్చారు. ఇక చరణ్ తన వీడియో సందేశంలో...'నాన్నగారి ఆరోగ్యం నిన్నటిలాగే నిలకడగా ఉంది. డాక్టర్స్ ఆయన పరిస్థితి విషయంగానే ఉందని చెబుతున్నప్పటికీ కోలుకోవడానికి ఆస్కారం ఉందని అంటున్నారు. అది కొంచెం ఉపశమనం కలిగించే అంశం. ఆయన ఈ పరిస్థితిని అధిగమించి తిరిగి వస్తారు'' అని అన్నారు. 

అలాగే తన తండ్రిపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు, అందరి ప్రార్ధనలకు చరణ్ ధన్యవాదాలు తెలిపారు. చరణ్ వీడియో సందేశం విన్న తరువాత బాలు ఆరోగ్యం మెరుగుపడినట్లు అనిపించడం లేదు. ఇంకా విషమంగానే ఉన్నట్లు డాక్టర్స్ చెప్పారని అనడం ఆందోళన కలిగిస్తుంది. కాకపోతే ఆయన  ఆరోగ్యం నిలకడగా ఉందనడం కొంచెం ధైర్యం కలిగించే విషయం. బాల సుబ్రహ్మణ్యం వయసు దాదాపు 74ఏళ్లుగా తెలుస్తుంది. వయసు ప్రభావం వలన కోవిడ్ ఆయనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

ఇక కోలీవుడ్  స్టార్ ద్వయం కమల్ హాసన్, రజిని కాంత్ బాలసుబ్రమణ్యం కోలుకొని తిగిరి రావాలని సోషల్ మీడియా ద్వారా కాంక్షించారు. దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన చిత్ర ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందడంతో పాటు, ఆయన కొరకు ప్రార్ధనలు చేస్తున్నారు. బాలు సతీమణికి కూడా కరోనా సోకగా ఆమె కోలుకుంటున్నారు. త్వరలో డిశ్చార్జ్ కానున్నారు.