మిస్టరీ థ్రిల్లర్ తో భయపెట్టబోతున్న హెబ్బా పటేల్, ఆహాలో రిలీజ్ కు రెడీగా `ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ `
ఆడియన్స్ ను భయపెట్టడానికి రెడీ అవుతోంది హీరోయిన్ హెబ్బా పటేల్. మిస్టరీ థ్రిల్లర్ మూవీతో రాబోతోంది.

ఆడియన్స్ లో చాలా మందికి క్రైమ్ థ్రిల్లర్స్ అన్నా.. మిస్టరీ థ్రిల్లర్ స్టోరీస్ అన్నా ఎంతో ఆసక్తి ఉంటుంది. వారికోసం అద్భుతమైన విందు రెడీ అవుతుంది ఆహాలో.. ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా తెరకెక్కింది ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ . అక్టోబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. రామ్ కార్తిక్, హెబా పటేల్ కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాకు విప్లవ్ కోనేటి దర్శక నిర్మాతగా వ్యవహరించారు.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్ తో పాటు పవిత్రా లోకేష్, జయప్రకాష్ లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూహ్య రీతిలో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈమూవీ రూపొందబోతోంది. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటుంది. వాళ్ళంతా అలా అనుకోండానికి కారణం ఏంటీ.. అందులో అసలు వాళ్ల ఉద్దేశం ఏంటి? పునర్జన్మల నేపథ్యంలో ఈ కథ ముందుకెళుతున్న కొద్దీ ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్... ఇలాంటివి ఎన్నెన్నో ఉండబోతున్నట్టు టీమ్ చెపుతోంది.
కథ విషయానికి వస్తే, మదనపల్లి టౌన్‌లో పునర్జన్మల నెపంతో.. ఇద్దరు కూతుర్లను పంచి..తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న.. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్, అన్నిటి మేళవింపుగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ.
హెబ్బా పటేల్ ఇటీవల నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్ . ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆహాలో అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ తో మళ్లీ ఆహా ప్రేక్షకులను పలకరించనున్నారు హెబ్బా పటేల్. ఆద్యంతం సస్పెన్స్ తో ఇంతవరకూ కనీవినీ ఎరుగని థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ .