మిల్కీ బ్యూటీ తమన్నాకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయని అనుకునేలోపు మళ్లీ వరుస అవకాశాలు అందుకొని ఆశ్చర్యపరిచింది. ఇటీవల 'ఎఫ్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా జత కడుతోన్న ఈ బ్యూటీ షూటింగ్, ప్రమోషన్లు అంటూ తీరిక లేకుండా గడుపుతోందట. ఈ కారణంగా ఆమె శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

తప్పనిసరిగా హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా.. తమన్నా మాత్రం తన ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదట. వారం రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించాలని కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతున్నా.. తమన్నా మాత్రం తన పనుల కారణంగా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదట.

దీన్ని బట్టి అమ్మడుకి ఎంత డెడికేషన్ ఉందో అర్ధమవుతోంది. కానీ తమన్నా ఫ్యామిలీ మాత్రం ఆమె ఆరోగ్యం ఏమైపోతుందోనని ఆందోళన చెందుతున్నారట!