బిగ్ బాస్ షో బుల్లితెరపై ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉండగా.. తమిళ బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ షోలో పాల్గొంటున్న పార్టిసిపెంట్ల ప్రవర్తన, వాళ్లు ధరించే బట్టలు, మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగులు అభ్యంతరకరంగా ఉంటున్నాయని.. వాటి వల్ల కుటుంబ ప్రేక్షకులు షో చూడడానికి ఇబ్బందిపడతారని, యువతను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయని,కాబట్టి ప్రతి ఎపిసోడ్ ని ముందు సెన్సార్ బోర్డుకి చూపించాలని.. వాళ్లు ఓకే చేసిన తరువాతే ప్రసారం చేయాలని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.

షో మొదలుకావడానికి నాలుగు రోజులే  సమయం ఉండడం.. ఇలాంటి సమయంలో పిటిషన్ వేయడంతో షో అనుకున్న సమయానికి మొదలవుతుందో లేదో అనే సందేహాలు  కలుగుతున్నాయి.

ఒకవేళ కోర్టు గనుక ప్రతీ ఎపిసోడ్ సెన్సార్ చేయాలని తీర్పునిస్తే అప్పుడు షోలో మసాలా మిస్ అవుతుందనే చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా.. మొదటి రెండు సీజన్లను హోస్ట్  చేసిన కమల్ హాసనే మూడో సీజన్ కూడా హోస్ట్ చేయబోతున్నారు.