సినిమాల కోసం శరీరాన్ని ఉక్కులా మార్చేసింది ఓ హీరోయిన్. జిమ్ లో గంటల తరబడి వ్యాయామం చేస్తూ రాటు తేలింది. ఇక తన కండలు తిరిగిన శరీరాన్ని ఈ విధంగా ప్రదర్శనకు పెట్టింది.
సావిత్రి జనరేషన్లో హీరోయిన్స్ బొద్దుగా ముద్దుగా ఉండేవారు. అభినయానికే ప్రాధాన్యతనిచ్చే ప్రేక్షకులు శరీర కొలతలు పట్టించుకునేవారు కాదు. విజయశాంతి, రమ్యకృష్ణ, సౌందర్య జనరేషన్ నాటికి కొంచెం మార్పు వచ్చింది. పొట్టలేకుండా స్లిమ్ గా ఉండాలని హీరోయిన్స్ భావించేవాళ్లు. హాలీవుడ్ చిత్రాల హవా ఇండియాలో మొదలైన నేపథ్యంలో ప్రేక్షకులు కూడా హీరోయిన్ అంటే నాజూగ్గా ఉండాలనే ఆలోచనకు వచ్చారు. దాదాపు ఒక పదిహేనేళ్ల క్రితం బాలీవుడ్ లో జీరో ప్యాక్ ట్రెండ్ మొదలైంది. కరీనా, కత్రినా, ప్రియాంకా చోప్రాతో పాటు పలువురు హీరోయిన్స్ జీరో సైజ్ ప్యాక్స్ ట్రై చేశారు.
ఇక టాలీవుడ్ లో సమంత గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆమె జీరో సైజ్ సాధించారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో నటించిన సమంత కఠిన కసరత్తులు చేసి జీరో సైజ్ డెవలప్ చేశారు. ఇండియాలో పలువురు హీరోయిన్స్ హీరోలతో పోటీపడి మరి జిమ్ బాడీలు మైంటైన్ చేస్తున్నారు. దిశా పటాని ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. ఇక మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్నా హీరోయిన్ తాప్సి పన్ను. ఆ మధ్య వరుసగా స్పోర్ట్స్ డ్రామాలు చేసిన తాప్సి శరీరాన్ని ఉక్కులా మార్చేసింది.
రష్మీ రాకెట్ మూవీలో తాప్సి అథ్లెట్ రోల్ చేశారు. ఈ సినిమా కోసం గంటల తరబడి రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది. నిజమైన అథ్లెట్స్ తో పరుగులు పెట్టింది. శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టినట్లు తాప్సి చెప్పారు. అనంతరం ఇండియన్ మహిళా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సి నటించారు. శభాష్ మిథు చిత్రం కోసం కూడా బరువు తగ్గి కఠిన కసరత్తులు చేశారు.
వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న తాప్సి గట్టి శరీర సౌష్టవం సాధించారు. ఇక తాప్సి సినీ ప్రస్థానం మొదలైంది తెలుగులోనే. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మందినాదం చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటించారు. తర్వాత పలువురు హీరోలతో జతకట్టారు. రవితేజ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ సరసన నటించారు. గత ఏడాది తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ తెలుగులో విడుదలైంది. కొన్నాళ్లుగా ఆమె హిందీలో ఎక్కువగా చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం జనగణమన, ఏలియన్ అనే తమిళ చిత్రాలు చేస్తున్నారు. లడ్కి హై కహా?,డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
