బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన భర్త విరాట్ కొహ్లీ కోసం సినిమాలు వదిలేస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని అనుష్క టీమ్ చెబుతోంది.

అసలు విషయంలోకి వస్తే.. 'జీరో' సినిమా తరువాత అనుష్క మరే సినిమా అంగీకరించలేదు. తన భర్తతో కలిసి ఐపీఎల్ సీజన్ లో సందడి చేస్తోంది. దీంతో ఇకపై అనుష్క సినిమాల్లో నటించదని, తన భర్తతోనే ఉంటూ అతడికి సపోర్ట్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇకపై తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ నటనకు దూరమవ్వాలని అనుకుంటుందని కొన్ని మీడియా వర్గాలు వార్తలు ప్రచురించాయి. అయితే అందులో నిజం లేదని.. అనుష్క నటన వదలడం లేదని ఆమె ప్రొడక్షన్ టీమ్ చెబుతోంది. కానీ ఇలాంటి వార్తలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. 

త్వరలోనే టీం ఇండియా ప్రపంచ కప్ ఆడబోతున్న సంగతి తెలిసిందే. కొహ్లీ ఇండియా టీంకి సారధ్యం వహించబోతున్నారు. ఇలాంటి సమయంలో భర్తకి తోడుగా నిలవాలని అనుష్క సినిమాలు లైట్ తీసుకుందని అంటున్నారు. మరి వీటిపై అనుష్క స్పందిస్తుందో లేదో.. చూడాలి!