తన స్పీచ్ లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే  నందమూరి బాలకృష్ట మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఓ సినీ ఫంక్షన్ లో ఆయన చేసిన రచ్చ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.  కార్తీక సోమవారం సందర్భంగా ఆయన  “సెహరి” అనే చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయడానికి సెప్షల్ గెస్ట్ గా హాజరయ్యాడు బాలయ్య. ఆ సందర్భంగా ఆయన తనదైన స్టయిల్ లో కాస్త హడావిడి చేశారు. పాకెట్ లోంచి మొబైల్ ఫోన్ తీసేసి విసిరేయటం, సినిమాను ప్రేమించండి కానీ లవ్ చేయొద్దంటూ కన్ఫ్యూజ్ స్టేట్ మెంట్ ఇవ్వటం చేసారు. అంతేకాదు హీరోను వర్జిన్ అంటూ పొగిడారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన ఓ పని మరింత వైరల్ అయింది.

సందర్బం​ ఏదైనా, సమయం ఏదైనా తనకు  కోపం వస్తే నేనింతే అంటూ బాలయ్య బాబు రియాక్ట్ అయిన తీరు ట్రెండింగ్‌లో నిలిచింది.  
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న టైమ్ లో ఆ పోస్టర్ పై హీరో కూడా ఓ చేయి వేస్తే, ఆ చేతిని బాలయ్య కొట్టడం కెమెరా కంటపడింది. బాలయ్య హీరో చేతిని కొట్టిన వీడియో నిమిషాల్లో వైరల్ అయింది. దీనిపై సదరు యంగ్ హీరో హర్ష వివరణ ఇచ్చాడు.

బాలయ్య తన చేతిపై కొట్టడాన్ని వివాదాస్పదం చేయొద్దని అంటున్నాడు హర్ష. తను ఎడమ చేత్తో పోస్టర్ ను పట్టుకున్నానని, దానికి కోపగించిన బాలయ్య తన చేతిపై కొట్టారని.. ఆ తర్వాత కొద్దిసేపటికి తను కుడిచేత్తో పోస్టర్ పట్టుకున్నానని వివరణ ఇచ్చాడు. 

ఇకే ఇదే ఫంక్షన్‌లో బాలకృష్ణ కోపంతో సెల్ ఫోన్ విసిరేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక‍్కసారిగా షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. పోస్టర్‌ రిలీజ్‌కు బాలకృష్ణ సన్నద్దమవుతున్న సమంయలో ఫోన్ రింగ్ అయింది. జేబులో నుంచి  ఫోన్‌ తీసి పరిశీలించిన బాలయ్య, నెంబర్ చూసి మరీ ఫోన్‌ను అలా గాల్లోకి  క్యాచ్‌ విసిరారు. అలా ఆయన  స్టేజిపై నుంచే  ఫోన్ విసిరేయటంతో  సినిమా యూనిట్ సభ్యులు అంతా ఒక్క క్షణం షాక్ అయ్యారు.