రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ ఓ నిర్ణయానికి వచ్చారట. `ఉస్తాద్.. ` ని పక్కన పెట్టబోతున్నారని టాక్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. పూజా హెగ్డేని తప్పించిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొంత పార్ట్ జరిగింది. రెండు షెడ్యూల్స్ లో పవన్ పాల్గొన్నారు. దీంతోపాటు కొన్ని పవన్ లేని సీన్లు కూడా చిత్రీకరించారు. ఇప్పుడు పవన్ కోసమే వెయిటింగ్.
కానీ ఆయన ఎప్పుడు షూటింగ్‌కి వస్తారో అనేదే ఇప్పుడు ప్రశ్న. పవన్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఎక్కువగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి వరకు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తెలంగాణలోనూ బీజీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుంది. దీంతో ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనబోతున్నారు.
దీంతో ఈ నెల మొత్తం పవన్ షూటింగ్‌లకు వచ్చే అవకాశం లేదు. డిసెంబర్ తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులను బట్టి పవన్.. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న చిత్రాల్లో మొదటగా `ఓజీ`ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. దాదాపు పదిహేను రోజులు పవన్ డేట్స్ ఇస్తే ఈ చిత్ర షూటింగ్ అయిపోతుంది. కానీ ఎప్పుడిస్తాడనేది పెద్ద ప్రశ్న.
ఒకవేళ డిసెంబర్‌లో డేట్స్ ఇస్తే, `ఓజీ` మూవీ చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పవన్ ఫస్ట్ ప్రయారిటీ `ఓజీ`. కారణం దాని వెనకాల త్రివిక్రమ్ ఉన్నారు. ఈ మూవీ ఏపీ ఎన్నికలకు తర్వాత విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇది ముంబయి గ్యాస్ స్టర్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇందులో అత్యంత క్రూరమైన మాఫియా లీడర్‌గా పవన్ కనిపించబోతున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఈ లెక్కన పవన్ డిసెంబర్‌లో డేట్స్ ఇస్తే `ఓజీ` పూర్తవుతుంది. లేదంటే అది కూడా వాయిదా పడుతుంది. ఇక జనవరి తర్వాత పవన్ పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవుతారు.ఏపీలో ఎన్నికల వేడి స్టార్ట్ అవుతుంది. ముమ్మరంగా పొలిటికల్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఆయన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం లేదు. ఎన్నికలు అయిపోయాకే ఆయన షూటింగ్‌ల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో `ఉస్తాద్ భగత్‌సింగ్` షూటింగ్‌లోకి రావాలంటే ఇంకా ఆరేడు నెలలు పడుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేయడం ఎందుకని, దర్శకుడు హరీష్ శంకర్ `ఉస్తాద్ భగత్‌సింగ్`ని పక్కన పెట్టి మరో ప్రాజెక్ట్ ని తెరకెక్కించే దానిపై ఫోకస్ పెడుతున్నారట.
ఆర్నెళ్లు టైమ్ వేసే చేయడం కంటే ఓ చిన్న సినిమా చేయడం బెటర్ అని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక `ఉస్తాద్..` ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన `ఉస్తాద్ భగత్ సింగ్` గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అదిరిపోయేలా ఉన్నాయి. `గబ్బర్ సింగ్` తర్వాత పవన్-హరీష్ కాంబోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా? ఇంతకి సినిమా షూటింగ్ ఎప్పుడు? అనేది పెద్ద ప్రశ్న.
