పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో రెండవసారి తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో రెండవసారి తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ అంచనాలు పూర్తిగా తెలిసిన దర్శకుడు హరీష్.
అయితే పవన్ పొలిటికల్ గా కూడా బిజీగా ఉండడంతో షూటింగ్ వేగంగా సాగడం లేదు. ఆగష్టు నెలలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ మ్యానియా జోరుగా సాగుతోంది.
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించే ప్రతి చిత్రంపై పొలిటికల్ ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల విడుదలైన బ్రో చిత్రం పొలిటికల్ గా ఎంత కాంట్రవర్సీగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పొలిటికల్ సెటైర్లు, సన్నివేశాలు సునామి స్థాయిలో ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని హరీష్ శంకర్ కూడా పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు.
పవన్ కళ్యాణ్ మెడ మీద చేయి వేసుకునే మ్యానరిజమ్ ని హరీష్ పోస్ట్ చేశారు. బ్రో చిత్రం ఇంత పెద్ద వివాదం అవుతున్నా హరీష్ శంకర్ తగ్గేదే లే అంటున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రంలో హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డైలాగ్స్ ని రాస్తున్నట్లు తెలుస్తోంది.
క్లాస్ చెప్పినట్లు కాకుండా పవన్ నోటి నుంచి ఎలాంటి డైలాగ్ వస్తే పేలుతుందో ఆ అదే స్టైల్ హరీష్ పొలిటికల్ పంచ్ లు రాస్తున్నారట. ఎన్నికల హీట్ పెంచే విధంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
