హరీష్ శంకర్, పవన్  చిత్రం అయితే చాలా కాలం క్రితమే ప్రారంభం అయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలు, రాజకీయ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మంగళవారం రోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మచిలీ పట్నంలో జనసేన పార్టీ ఈ భారీ సభని నిర్వహించింది. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వినోదయ సిత్తం, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. 

హరీష్ శంకర్, పవన్ చిత్రం అయితే చాలా కాలం క్రితమే ప్రారంభం అయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. ఇలయదళపతి విజయ్ సూపర్ హిట్ చిత్రం తేరిని రీమేక్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించకపోయినా ఆల్మోస్ట్ కంఫర్మ్ అనే ఊహాగానాలు ఉన్నాయి. దీనితో కథ గురించి ఎవరు ప్రచారాలు వాళ్ళు మొదలు పెట్టేశారు. 

తేరి చిత్రానికి హరీష్ శంకర్ చాలా మార్పులు చేస్తున్నారని.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ లో చేంజెస్ చేశారని అంటున్నారు. అయితే తాజాగా మరో రూమర్ వైరల్ ఐంది. తేరి కథలో చిన్న పాప పాత్రని హరీష్ శంకర్ చిన్న బాబు పాత్రగా మార్చారని అంటున్నారు. అలాగే తేరిలో విజయ్ బేకరీ నడిపే వ్యక్తిగా కనిపిస్తారు. ఉస్తాద్ లో పవన్ ని హరీష్ లెక్షరర్ గా చూపించనున్నారట. ఈ మేరకు పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. 

ఈ రూమర్స్ ని హరీష్ శంకర్ తనదైన శైలిలో ఖండించారు. 'అది నిజం కాదు సర్.. నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను. ఇలాంటివి పోస్ట్ చేసే ముందు నన్ను ఒకసారి అడగవచ్చు అని రూమర్స్ ని ఖండించారు. గతంలో చిన్న పాప పాత్ర కోసం హరీష్ శంకర్.. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హని నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. 

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ చిత్రమా, లేక ఒరిజినల్ స్టోరీనా అనేది పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. హరీష్ శంకర్, పవన్ కాంబోలో రీమేక్ రావడం ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. దీనితో తేరి రీమేక్ చేయవద్దు అంటూ ఫ్యాన్స్ హరీష్ ని ట్రోల్ చేశారు. తాను పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి చిత్రం చేస్తున్నానో ఫ్యాన్స్ కి చెప్పేవాడిని అని.. కానీ ఫ్యాన్స్ ట్రోలింగ్ తో చాలా అతి చేశారు.. అందుకే చెప్పట్లేదు అని హరీష్ గతంలో మండిపడ్డారు.