పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో దాదాపు 11 ఏళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. మరోసారి హరీష్, పవన్ కాంబో సెట్ అయింది. హరీష్ శంకర్.. పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో దాదాపు 11 ఏళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. మరోసారి హరీష్, పవన్ కాంబో సెట్ అయింది. హరీష్ శంకర్.. పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. చూస్తుంటే ఈ చిత్ర షూటింగ్, ఇతర కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నట్లు అర్థం అవుతోంది. 

పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. త్వరలో గ్లింప్స్ రిలీజ్ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లకి మరో ఫోర్స్ తోడయ్యింది.. అతడే దేవిశ్రీ ప్రసాద్. తాజాగా దేవిశ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ లు ఉస్తాద్ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. 

 'గబ్బర్ సింగ్' విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చిత్రంలోని పాటలు దశాబ్దం తరువాత కూడా నేటికీ మారుమ్రోగుతూ ప్రేక్షకులు కాలు కదిపేలా చేస్తున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

Scroll to load tweet…

'ఉస్తాద్ భగత్ సింగ్' మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో "అరేయ్ సాంబ రాస్కోరా" అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది. అలాగే వీడియోలో దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే 'గబ్బర్ సింగ్'ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించబోతున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Scroll to load tweet…

ఈ చిత్రంలో అశుతోష్ రానా, కెజిఎఫ్ అవినాష్, నవాబ్ షా లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ ని మించేలా ఉస్తాద్ మ్యూజిక్ ఉండాలని.. దేవిశ్రీ మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.