Asianet News TeluguAsianet News Telugu

అభిజీత్ పై తనకున్న సైకో ప్రేమను బయటపెట్టిన హారిక

టాస్క్ లో హారిక కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో అభిజిత్ పట్ల తనకు ప్రేమాభిమానాలు కలిగాయట. ఆ క్రమంలో అభిజీత్ తో ఎవరు మాట్లాడినా హరికకు నచ్చేది కాదట. అతను నా సొంతం మాత్రమే అనుకున్న హారిక.. ఇతరులతో అభిజీత్ మాట్లాడినా.. చాలా ఫీల్ అయ్యేదట. అభిజిత్ తను నాకు మాత్రమే కావాలనే పొసెసివ్ నెస్ లో ఉండేదానిని అని హారిక ఓపెన్ గా చెప్పేసింది.

harika expresses her unconditional love towards abhijeeth in bigg boss ksr
Author
Hyderabad, First Published Dec 15, 2020, 12:35 AM IST
బిగ్ బాస్ సీజన్ 4 వచ్చే వారం ముగియనుంది. ఇంటిలో ఉన్న ఐదుగురు సభ్యుల్లో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కానున్నారు. అఖిల్, అభిజితి , అరియనా, హారిక మరియు సోహైల్ ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. టాప్ ఫైవ్ లో చోటు సంపాదించుకొని వారు ఫైనలిస్ట్స్ హోదా పొందారు. నిన్న మోనాల్ ఎలిమినేషన్ తరువాత ఫైనలిస్ట్స్ మాత్రమే మిగిలారు. కాగా వీరికి నేడు కొన్ని టాస్క్ లు బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఎటువంటి దాపరికం లేకుండా ఇంటి సభ్యులపై అభిప్రాయం చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 
 
ఈ టాస్క్ లో హారిక కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. హౌస్ లో అభిజిత్ పట్ల తనకు ప్రేమాభిమానాలు కలిగాయట. ఆ క్రమంలో అభిజీత్ తో ఎవరు మాట్లాడినా హరికకు నచ్చేది కాదట. అతను నా సొంతం మాత్రమే అనుకున్న హారిక.. ఇతరులతో అభిజీత్ మాట్లాడినా.. చాలా ఫీల్ అయ్యేదట. అభిజిత్ తను నాకు మాత్రమే కావాలనే పొసెసివ్ నెస్ లో ఉండేదానిని అని హారిక ఓపెన్ గా చెప్పేసింది. అలాగే అభిజీత్ కామ్ అని అందరూ అనుకుంటారు. తను తక్కువ మాట్లాడాడని కారణం, తనకు ఇగో అడ్డువస్తుందని, అందుకే తక్కువ మాట్లాడతాడని ఆమె చెప్పారు. 
 
హారిక మాటలు అభిజిత్ కి కొంచెం గుండెల్లో గుచ్చుకునే ఉంటాయి. ఈ మాటలకు అభిజీత్ స్పందించారు. నాకంటే పది రెట్లు ఇగో నీకు ఉందని అతను హారికతో అన్నాడు.  కొన్ని వారాలుగా అభిజీత్ మరియు హారిక ఒక టీమ్ గా ఉంటున్నారు. అభిజిత్-హారిక లవ్ స్టోరీ ఇప్పుడు హౌస్ లో ఆసక్తికరంగా మారింది. రిలేషన్ కారణంగా అభిజిత్ ని వెనకేసుకొచ్చిన హారికకు నాగార్జున సైతం క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. 
Follow Us:
Download App:
  • android
  • ios