నీహారిక పాత్రను పవన్ తో పోలుస్తూ సెటైర్లు!

Happy Wedding character reminds of PK
Highlights

ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ క్యారెక్టర్ కూడా అంతే అంటూ పవన్ వ్యతిరేకులు అతడిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకునే విషయంలో పవన్ కు స్థిరత్వం లేదని కామెంట్స్ చేస్తున్నారు

మెగాడాటర్ నీహారిక నటించిన 'హ్యాపీ వెడ్డింగ్' సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో నిహారిక నిరాశకు గురైనట్లు సమాచారం. అయితే సినిమాలో నీహారిక పోషించిన అక్షర అనే క్యారెక్టర్ ను పవన్ కు లింక్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో నిహారిక క్యారెక్టర్ కు పవన్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? కథ ప్రకారం సినిమాలో నీహారిక ఓ కన్ఫ్యూజన్ క్యారెక్టర్ లో కనిపించింది.

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా..? లేక తనను ప్రేమిస్తున్న మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా..? అనేది డిసైడ్ చేసుకోలేక అటు ఇటు కాకుండా ఉంటుంది. దీంతో ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ క్యారెక్టర్ కూడా అంతే అంటూ పవన్ వ్యతిరేకులు అతడిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకునే విషయంలో పవన్ కు స్థిరత్వం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

చాలా కాలం తెలుగుదేశం పార్టీకు దగ్గరగా ఉండి ఇప్పుడు ఆ పార్టీకి దూరం కావడం మధ్యలో జగన్ పార్టీ కు దగ్గరైనట్లు కనిపించడం ఇప్పుడు ఆ పార్టీకు కూడా దూరం కావడం, బిజెపితో ప్రస్తుతానికి బాగున్నా.. రేపు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి అంటూ ఇది అంతా.. నిహారిక నటించిన అక్షర పాత్రను గుర్తుచేస్తోందని జోక్స్ వేసుకుంటున్నారు. సినిమా డైరెక్టర్ పవన్ వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఉంటాడంటూ ట్రోల్ చేస్తున్నారు.  

loader