యేటర్స్ లో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు నార్త్ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించింది. నేటి నుంచి హను మాన్ తెలుగు వర్షన్ జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైంది.
చిన్న చిత్రం గా విడుదలైన హను మాన్ ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ,హీరో తేజ సజ్జా తమ చిత్రాన్ని బలంగా నమ్మి సంక్రాంతి బరిలో నిలిపారు.
వారి ధైర్యమే ఇప్పుడు అద్భుతాలకు కారణం అవుతోంది. ఆంజనేయ స్వామి నేపథ్యంలో జనరంజకమైన సూపర్ హీరో చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు అందించారు. థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు నార్త్ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
వారి నిరీక్షణ ఫలించింది. నేటి నుంచి హను మాన్ తెలుగు వర్షన్ జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైంది. హిందీ వర్షన్ శనివారం నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ మొదలయింది. దీనితో మరోసారి హనుమాన్ హంగామా దేశం మొత్తం వినిపిస్తోంది.
అయితే తెలుగు వర్షన్ లో ఫ్యాన్స్ కి కాస్త నిరాశ కలిగించేలా నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. హను మాన్ థియేటర్స్ లో ప్రదర్శించిన రన్ టైం 2 గంటల 38 నిముషాలు. కానీ ఓటిటిలో 8 నిమిషాలు ట్రిమ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. 8 నిమిషాల పాటు ఎందుకు ట్రిమ్ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు అని ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిందీ వెర్షన్ మాత్రం పూర్తిగా 2.38 గంటల రన్ టైం తో స్ట్రీమింగ్ అవుతోంది.
