Asianet News TeluguAsianet News Telugu

`105 మినిట్స్`లో హన్సిక విశ్వరూపం.. బిగ్‌ బాస్‌ శివాజీ ఆవిష్కరించిన `మార్కెట్‌ మహాలక్ష్మి`..

హన్సిక నటించిన హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ 105 మినిట్స్` విడుదలై ట్రెండింగ్‌ అవుతుంది. మరోవైపు బిగ్‌ బాస్‌ శివాజీ.. `మార్కెట్‌ మహాలక్ష్మి` పోస్టర్‌ని విడుదల చేశారు. 
 

hansika 105 movie trailer out and sivaji released market mahalakshmi title poster arj
Author
First Published Jan 19, 2024, 11:54 PM IST

హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా వస్తున్న సినిమా `105 మినిట్స్`. గతంలో విడుదలైన మోషన్, పోస్టర్ థీమ్ సాంగ్ కి మంచి స్పందన లభించగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. వినూత్న రీతిలో హన్సిక సినిమాలో చేసిన అదే క్యారెక్టర్ గెటప్ లో స్టేజ్ పైకి వచ్చి ట్రైలర్ ని రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఎక్స్పరిమెంటల్ చిత్రంగా 105 మినిట్స్ సినిమా నిర్మించారు. పనోరమ స్టూడియో ద్వారా ట్రైలర్ రిలీజ్ చేయగా జనవరి 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ, `105 మినిట్స్` సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక కంప్లీట్ ఎక్స్ పరిమెంటల్‌ మూవీ. 34 నిమిషాల షాట్ ని సింగిల్ టేక్ లో చేయడం అనేది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. 8 రోజులు రిహార్సల్స్ చేసిన షార్ట్ అది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 26న రిలీజ్ అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు.  

`బిగ్ బాస్` ఫేమ్‌ హీరో శివాజీ చేతుల మీదగా 'మార్కెట్ మహాలక్ష్మి' టైటిల్ పోస్టర్ లాంచ్..

`కేరింత` మూవీ ఫేమ్‌ హీరో  పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ 'టైటిల్ పోస్టర్'ని బిగ్ బాస్ ఫేమ్‌ హీరో 'శివాజీ' చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగ్గా, ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేసారు.  

హీరో శివాజీ మాట్లాడుతూ, నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. 'కేరింత' మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన హీరో 'పార్వతీశం'కి తప్పకుండ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ 'అఖిలేష్ కలారు'కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ' వియస్ ముఖేష్' కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను. హీరోయిన్ 'ప్రణీకాన్వికా' నేమ్ టంగ్ ట్విస్టర్ లా ఉంది. ఆర్ట్ ఫార్మ్ ని  నమ్ముకున్న ప్రతి ఒక్కరు తప్పకుండ సక్సెస్ అవ్వుతారు. అందరు నిజాయతి గా పనిచేయండి సక్సెస్ దానంతట అదే వస్తుంది` అని చెప్పారు. 

డైరెక్టర్ 'వియస్ ముఖేష్' మాట్లాడుతూ: ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరించిన శివాజీ గారికి, సహకరించిన బెక్కం వేణు గోపాల్ గారి కి ధన్యవాదాలు. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా నిర్మాత అఖిలేష్ గారికి, నా విజన్ ని నమ్మి ఈ చిత్రంలో నటించడానికి ముందుకి వచ్చినా హీరో హీరోయిన్ లకు తదితర నటి నటులకు పేరు పేరునా ప్రతి ఒక్కరకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు` అని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios