మహేశ్ బాబు అభిమానులకు ‘గుంటూరు కారం’ నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చింది. రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ Trivikram కాంబోలో వస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’. వారం రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వరుసగా అప్డేట్స్ అందిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, సాంగ్స్ ను కూడా వదిలిన విషయం తెలిసిందే. అటు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
రేపు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. షెడ్యూల్ ప్రకారం Guntur Kaaram PreRelease Event జనవరి 6న జరగనుండగా... కొన్ని పరిస్థితితుల కారణంగా వాయిదా వేయాల్సి వస్తోందని చెప్పారు. ‘మేము ఎంత ప్రయత్నించినా ఊహించని పరిస్థితులు, భద్రతా అనుమతుల సమస్యల కారణంగా 6 జనవరి 2024న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #GunturKaaram ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడం లేదు. ఈ ప్రకటన కోసం మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. వేదిక ఏర్పాటుతో ఈవెంట్ కోసం కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం. కాస్తా వేచి ఉండండి.’ అంటూ అప్డేట్ ఇచ్చారు.
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్న మూవీలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela, మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నారు. జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది.
