Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ గుణశేఖర్ నెక్ట్స్ ప్రాజెక్టు టైటిల్, స్టోరీ లైన్

 కమర్షియల్ సినిమాలను కూడా తనదైన పద్ధతిలో వైవిధ్యాన్ని జోడించి వాటిని స్పెషల్ చిత్రాలుగా ప్రెజెంట్ చేసి సక్సెస్ అందుకున్నాడు గుణశేఖర్

Gunasekhar registered three titles for two subjects jsp
Author
First Published Mar 23, 2024, 9:31 AM IST

కమర్షియల్ సినిమాలతో పాటుగా పౌరాణిక, చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గుణశేఖర్. బాల నటీనటులతో 'రామాయణం' ఇతిహాసాన్ని తెర మీదకి తీసుకొచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. 'మనోహరం', 'చూడాలని ఉంది', 'ఒక్కడు' లాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసారు. అయితే గత కొంతకాలంగా  గుణశేఖర్ తన స్థాయికి తగ్గ సక్సెస్ అందుకోవడంలో విఫలం అవుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో 'రుద్రమదేవి' చిత్రం చేశాడు. అందుకోసం కాకతీయుల చరిత్రను రీసెర్చ్ చేసి, మూడేళ్లపాటు తీవ్రంగా శ్రమించి సినిమాగా మలిచారు. అయితే ఈ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డీ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయింది. బిలో యావరేజ్ అనిపించుకుంది. బన్ని ఉన్నాడు కాబట్టే సినిమా ఆ మాత్రం బయిటపడిందని అన్నారు. 

Survey: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

జనం మర్చిపోతున్న చరిత్రను తెర మీదకు తీసుకురావడంలో విజయం సాధించాడు కానీ.. ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయి చూసేంత ఎంగేజింగ్ గా సినిమా చూపించలేకపోయారనే విమర్శలువచ్చాయి. ఎమోషనల్ గా ప్రేక్షకుడిని సినిమాతో కనెక్ట్ చేయలేకపోయాడు. అందుకే ఆశించిన స్థాయిలో సినిమా హిట్ అవ్వలేదు. దాంతో  దాదాపు ఏనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత గుణశేఖర్ 'శాకుంతలం' వంటి మరో విమెన్ సెంట్రిక్ మైథలాజికల్ డ్రామాతో మన ముందుకి వచ్చారు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్ తో 3డీలో తీశారు. దీని నిర్మాణంలో గుణ శేఖర్ తో పాటుగా దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ జత చేరారు. అయినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోయింది.  

ఈ వరస ఫ్లాపులతో  డైరెక్టర్ గుణశేఖర్ (Guna Sekhar) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ (Hiranyakashyap) కూడా చేతులు మారింది.  ఆ మధ్యన  డైరెక్టర్ పేరు లేకుండా ‘హిరణ్యకశ్యప’కు సంబంధించి ఓ పోస్టర్‌ని రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. ఇందులో ఈ సినిమాకు కథ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందిస్తారంటూ తెలియజేశారు.   రానాతోనే గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు. ‘శాకుంతలం’ పనుల్లో ఉండటం వల్ల.. ఆ సినిమాని కొంతకాలం పాటు వాయిదా వేస్తున్నట్లుగా ఆ మధ్య చెప్పుకొచ్చారు. అయితే సడెన్‌గా దర్శకుడి పేరు లేకుండా పోస్టర్ వదలడంతో.. దీనిపై టాలీవుడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. గుణశేఖర్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా రానాని టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అదంతా గతం. ఇప్పుడు మరో ప్రాజెక్టుని గుణశేఖర్ రెడీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన రెండు టైటిల్స్ రిజిస్టర్ చేసారు.

గుణశేఖర్ రిజిస్టర్ చేసిన టైటిల్స్ ఏమిటంటే.... గంగావతరణం, భగీరధ, భక్త ప్రహ్లాద. ప్రస్తుతం గంగావతరణం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. పవిత్ర భారతావనిలో మహా పవిత్రంగా భావించబడుతున్న పుణ్యనది  గంగ . గంగకు పురాణ కాలం నుండి ప్రాశస్త్యం వుంది. అసలు దివినుండి భూమీదకు దిగి వచ్చిన గంగావతరణ దృశ్యమే వర్ణించనలవికాని అపూర్వ దృశ్యం. గంగను తీసుకువచ్చిన భగీరథుడు తన పితృదేవతల భస్మంపై ఆ పుణ్యజలాలను ప్రవహింపజేయగా వారందరికీ ఉత్తమ గతులు కలిగాయి. .ఈ పౌరాణిక ఇతిహాసం విన్నా, చదివినా ఒడలు పులకించిపోతుంది. దాన్నే గుణశేఖర్ తెరకెక్కించటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు నటిస్తారు..ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios