స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం'. క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పౌరాణిక గాధతో విజువల్ వండర్ గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం'. క్రేజీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పౌరాణిక గాధతో విజువల్ వండర్ గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దుశ్యంతుడు, శకుంతల రమణీయ ప్రేమ గాధని గుణశేఖర్ తన విజన్ తో చూపించబోతున్నారు.
ఈ చిత్రాన్ని గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ యంగ్ ప్రొడ్యూసర్ నిర్మాణంలో సమంత చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా నీలిమ గుణ నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నీలిమ గుణ నిశ్చితార్థం ప్రైవేట్ గా జరిగింది.
నీలిమకి కాబోయే వరుడి పేరు రవి ప్రఖ్యా. నేడు జరిగిన నిశ్చితార్థంతో వీరిద్దరూ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వరుడి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జీవితాంతం సాగే కొత్త ప్రయాణం మొదలైంది అంటూ నీలిమ తన నిశ్చితార్థ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నీలిమ ఎల్లో లెహంగాలో మెరిసిపోతుండగా, రవి వైట్ షేర్వాణీలో కనిపిస్తున్నారు. వధూవరులు ఇద్దరూ ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. వీరిద్దరి వివాహానికి సంబందించిన తేదీ ఖరారు కావాల్సి ఉంది.

నీలిమ గుణ తన తండ్రి తెరకెక్కించే చిత్రాలకు నిర్మాతగా కొనసాగాలని భావిస్తున్నారు. అవకాశం ఉంటే ఇతర చిత్రాలు నిర్మించాలని కూడా చూస్తున్నారు.
