కార్తికేయ, అనఘ జంటగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుణ 369'. ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌జీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు.  ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ రోజు  చిత్ర యూనిట్ “గుణ 369” ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.  రొమాన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలను కలగలిపి ఇంట్రస్టింగ్ గా ట్రైలర్ కట్ చేశారు. 

హింస వలన గొడవల వలన ప్రశాంత కోల్పోతాం అని శాంతి మార్గాన్ని ఎన్నుకున్న యువకుడిగా కార్తీక్ కనిపిస్తున్నారు. సెల్ ఫోన్ స్టోర్ లో పనిచేసే అమ్మాయిగా  హీరోయిన్ అనఘా కనిపిస్తుంది. అమ్మాయి ప్రేమకోసం అల్లరి చేష్టలు చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్న హీరో , హీరోయిన్ కి ఎదురైన ప్రమాదాలను నుండి కాపాడడానికి హింసా మార్గం ఎంచుకున్నాడు అర్దమవుతోంది. చివర్లో హీరో జైలుకు వెల్తాడు. అక్కడ అతినికి కేటాయించిన నెంబర్ 369 అని తెలుస్తోంది. 

దర్శకుడు మాట్లాడుతూ 'నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్‌ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది'అని అన్నారు.

నిర్మాతలు అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి మాట్లాడుతూ ' ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ'ని ప్రకటించారు.